54 రోజుల పసిగుడ్డును గోడకేసి విసిరికొట్టిన తండ్రి..చావుతో పోరాడుతున్న పసిప్రాణం

  • Published By: nagamani ,Published On : June 22, 2020 / 07:30 AM IST
54 రోజుల పసిగుడ్డును గోడకేసి విసిరికొట్టిన తండ్రి..చావుతో పోరాడుతున్న పసిప్రాణం

54 రోజుల పసిగుడ్డును చంపటానికి యత్నించిన కన్నతండ్రి చేతిలో తీవ్ర గాయాలపాలైన పసిబిడ్డ చావుతో పోరాడుతోంది.  బ్రతకాలని పసిప్రాణం కొట్టుకుంటోన్న ఘటన కేరళలోచోటుచేసుకుంది. ఆ బిడ్డను బతికించటానికి డాక్టర్లు అహర్నిశలు కష్టపడుతున్నారు.

వివరాల్లోకి వెళితే..జూన్ 19. కేరళలోని ఎర్నాకుళంలోని అంగమాలి ప్రాంతం. ఆదివారం నాడు 54 రోజుల పసిగుడ్డును హాస్పిటల్ కు తీసుకొచ్చారు. మంచంపైనుంచి పడిపోయిదనీ..గాయాలయ్యాయని బిడ్డకు చికిత్స చేయమంటూతీసుకొచ్చారు. కానీ ఆ బిడ్డను చూసిన డాక్టర్లు మాత్రం అనుమానపడ్డారు. మంచంపైనుంచి పడితే ఇంతలా ఎలా గాయాలవుతాయని అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే హాస్పిటల్ కు వచ్చిన పోలీసులు బిడ్డను పరిశీలించగా వారికి కూడా అదే అనుమానం వచ్చింది. దీంతో బిడ్డ్ తండ్రి 40 ఏళ్ల షైజు థామస్ ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బైటపడింది.  ఆ పసిగుడ్డను విసిరికొట్టటంతోనే అంతగా గాయాలయ్యాయని తేలింది. 

పట్టుకుంటేనే చేతిలోంచి పడిపోతుందనే భయంతో భద్రంగా పట్టుకోవాల్సిన 54 రోజుల పసిగుడ్డుపై అమానవీయంగా ప్రవర్తించాడు ఓ తండ్రి థామస్. పాపం పుణ్యం తెలీయని మూడు నెలల లోపు శిశువు మంచంపై పడుకుని బోసి నవ్వులు నవ్వుతూ నిద్రపోతోంది. ఈ ప్రపంచంలో ఉండే ఏ దారుణాల గురించి తెలియని వయస్సులో అమ్మపాలు తాగి..కలలో దేవుడు చెప్పే ఊసులు వింటూ హాయిగా బోసినవ్వులు నవ్వుతో నిద్రపోతోంది.

ఇంతలో తండ్రి వచ్చాడు. మంచంపై హాయిగా నిద్రపోతున్న పసిబిడ్డను చూశాడు. పైగా మద్యం తాగిన మైకంలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడో తెలియని పశుత్వంతో బిడ్డను చేతుల్లోకి తీసుకుని విసిరికొట్టాడు. దీంతో ఏమీ తెలియనట్లుగా ఇంటిలోవాళ్లకు కేకేసి బిడ్డ మంచంపైనుంచి పడిపోయిందని చెప్పటంతో హాస్పిటల్ కు తీసుకొచ్చారు. కానీ బిడ్డకు తగిన గాయాల తీరుని చూసిన డాక్టర్లు పోలీసులకు సమాచారం అందించటంతో అసలు విషయం బైటపడింది. మద్యం తాగిన మైకంలో పసిబిడ్డను విసిరికొట్టగా గాయాలయ్యాయని చెప్పాడుథామస్.

దీంతో పోలీసులు థామస్ పై సెక్షన్ 307 కింద (హత్యయత్నం)కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన 14 రోజులు జ్యుడీషియల్ కష్టపడీకి పంపించారు. కసాయి తండ్రి చేతిలో తీవ్రంగా గాయపడిన ఆ 54 రోజుల పసిగుడ్డు ప్రాణాలతోపోరాడుతోంది.

Read: Goa Corona తో 85 ఏళ్ల మహిళ మరణం