Tamil Nadu: క్లాస్‌మేట్స్ వేధింపులు.. స్కూల్ మానేసిన గిరిజన విద్యార్థులు

తమిళనాడు, తంజావూరు జిల్లాలోని ఒక స్కూల్‌లో వందలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో మెలా ఉల్లూర్ గ్రామానికి చెందిన నరిక్కురువా అనే గిరిజన తెగకు చెందిన 80 మందికిపైగా విద్యార్థులు కూడా ఉన్నారు. వీరి భాష, కట్టుబాట్లు, ఆచార వ్యవహరాలు భిన్నంగా ఉంటాయి.

Tamil Nadu: క్లాస్‌మేట్స్ వేధింపులు.. స్కూల్ మానేసిన గిరిజన విద్యార్థులు

Tamil Nadu: తోటి విద్యార్థుల వేధింపులు భరించలేక 80 మంది గిరిజన విద్యార్థులు స్కూల్ మానేసిన ఘటన తమిళనాడులో జరిగింది. ఈ అంశంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. తమిళనాడు, తంజావూరు జిల్లాలోని ఒక స్కూల్‌లో వందలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
వీరిలో మెలా ఉల్లూర్ గ్రామానికి చెందిన నరిక్కురువా అనే గిరిజన తెగకు చెందిన 80 మందికిపైగా విద్యార్థులు కూడా ఉన్నారు. వీరి భాష, కట్టుబాట్లు, ఆచార వ్యవహరాలు భిన్నంగా ఉంటాయి. ఇదే కారణంతో తోటి విద్యార్థులు వీళ్లను వేధించేవాళ్లు. వీళ్ల భాష, సంస్కృతిని హేళన చేస్తూ మాట్లాడేవాళ్లు. ఈ వేధింపులు ఎక్కువ కావడంతో విద్యార్థులు క్రమంగా స్కూలుకు రావడం మానేశారు. అలా 80 మందికిపైగా గిరిజన విద్యార్థులు స్కూల్ మానేశారు. ఇటీవల జిల్లా విద్యాశాఖ అధికారులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, పలు విభాగాల ఆధ్వర్యంలో సర్వే నిర్వహించగా ఈ విషయం వెలుగు చూసింది.
గత విద్యా సంవత్సరంలో తంజావూరు జిల్లాలో 1,700 విద్యార్థులు బడి మానేశారు. వీరిలో 80 మంది నరిక్కురవ గిరిజన విద్యార్థులే. వీళ్లంతా మెలా ఉల్లూర్ గ్రామ వాసులే. వీళ్లు చదువుకోవడం కోసం అడవి గుండా, చాలా కఠిన పరిస్థితుల మధ్య ప్రయాణించాల్సి ఉంటుంది. దగ్గర్లోని స్కూల్ చేరుకోవాలంటే దట్టమైన అడవుల్లో నడుచుకుంటూ, నదులు, కాలువల్ని దాటుకుంటూ రావాలి. మధ్యలో అటవీ జంతువుల నుంచి ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి. ఇంతకష్టపడి వీళ్లు సమీపంలోని స్కూల్‌కు చేరుకుంటే, అక్కడ తోటి విద్యార్థులు వేధింపులకు గురి చేశారు. దీంతో విద్యార్థులంతా బడి మానేశారు. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు ఇప్పుడు వాళ్లున్న గ్రామంలోనే స్కూల్ ఏర్పాటు చేసేందు