AAP Minister Rajendra Pal Gautam : మ‌త‌మార్పిడి కార్యక్రమంలో ఆప్ మంత్రి .. హిందూ దేవుళ్ల‌ను పూజించ‌వద్దని పిలుపు

ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రి రాజేంద్ర పాల్ గౌత‌మ్ మతమార్పిడి వివాదంలో చిక్కుకున్నారు. సామూహిక మ‌త మార్పిడి కార్య‌క్రంలో పాల్గొన్న రాజేంద్ర పాల్ గౌత‌మ్ హిందూ దేవుళ్లను పూజించవద్దు అంటూ పిలుపునిచ్చారు.

AAP Minister Rajendra Pal Gautam : మ‌త‌మార్పిడి కార్యక్రమంలో ఆప్ మంత్రి .. హిందూ దేవుళ్ల‌ను పూజించ‌వద్దని పిలుపు

AAP Minister joins event where 10,000 Hindus were converted to Buddhism

AAP Minister Rajendra Pal Gautam : ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రి రాజేంద్ర పాల్ గౌత‌మ్ మతమార్పిడి వివాదంలో చిక్కుకున్నారు. సామూహిక మ‌త మార్పిడి కార్య‌క్రంలో పాల్గొన్న రాజేంద్ర పాల్ గౌత‌మ్ హిందూ దేవుళ్లను పూజించవద్దు అంటూ పిలుపునిచ్చారు. బుధవారం (అక్టోబర్5,2022)న్యూఢిల్లీలోని ఝండేవాలన్‌లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్‌లో దసరా రోజున 10,000మంది హిందువులను సామూహికంగా బౌద్ధ మతంలోకి మార్చిన కార్యక్రమంలో పాల్గొన్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజేంద్ర పాల్ హిందూ దేవుళ్ల‌ను పూజించ‌రాదు అంటూ సూచించారు. సామూహికంగా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంపై బీజేపీ తీవ్ర విమ‌ర్శ‌లు చేసింది.

అంబేద్క‌ర్ బౌద్ధం స్వీక‌రించిన స‌మ‌యంలో ధ‌మ్మ చ‌క్ర ప్ర‌వ‌ర్త‌న్ దిన్ పేరుతో ఓ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత ప్ర‌తి సంవత్సరం కూడా ఈ దినాన్నిరోజుని పాటిస్తున్నారు. వేలాది మంది బౌద్ధం స్వీక‌రించిన తాజా కార్య‌క్ర‌మంలో ఆప్ మంత్రి గౌత‌మ్ పాల్గొన్నారు. బ్ర‌హ్మ‌, విష్ణు, మ‌హేశ్వ‌రుడిపై త‌న‌కు న‌మ్మ‌కం లేద‌ని..వారిని పూజించ‌ను మంత్రి ప్ర‌తిజ్ఞ చేశారు.

ఇటువంటి కార్యక్రమం హిందూ మ‌తాన్ని, బౌద్ధ మ‌తాన్ని అవ‌మానించ‌డ‌మే అని బీజేపీ మండిపడింది. ఆప్ మంత్రులు మ‌త ఘ‌ర్ష‌ణ‌ల‌ను సృష్టిస్తున్న‌ారని బీజేపీ ఎంపీ మ‌నోజ్ తివారి ఆరోపించారు. మంత్రి రాజేంద్ర పాల్ గౌత‌మ్ ను త‌క్ష‌ణ‌మే క్యాబినెట్ నుంచి తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు. త‌న‌కు బౌద్ధంపై న‌మ్మ‌కం ఉంద‌ని..రాజ్యాంగం ప్ర‌కార‌మే మ‌త స్వేచ్ఛ‌ను పాటిస్తున్న‌ాని మంత్రి గౌత‌మ్ స్పష్టంచేశారు. “మిషన్ జై భీమ్ మద్దతుతో”, 10,000 మందికి పైగా మేధావులు గౌతమ బుద్ధుని విశ్వాసంలోకి మారడం ద్వారా కుల రహిత మరియు అంటరాని భారతదేశాన్ని తయారు చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.