Mahua Moitra : పార్లమెంటులో ప్రశ్నించకుండా అదానీ డబ్బులు ఇస్తానన్నాడు…ఎంపీ మహువామొయిత్రా సంచలన వ్యాఖ్యలు

బడా పారిశ్రామికవేత్త అదానీపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ గౌతమ్ అదానీ గత మూడేళ్లలో ఇద్దరు లోక్‌సభ ఎంపీల ద్వారా తనను రెండుసార్లు సంప్రదించారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు.....

Mahua Moitra : పార్లమెంటులో ప్రశ్నించకుండా అదానీ డబ్బులు ఇస్తానన్నాడు…ఎంపీ మహువామొయిత్రా సంచలన వ్యాఖ్యలు

Mp Mahua Moitra, Adani

Updated On : October 28, 2023 / 7:59 AM IST

Mahua Moitra : బడా పారిశ్రామికవేత్త అదానీపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ గౌతమ్ అదానీ గత మూడేళ్లలో ఇద్దరు లోక్‌సభ ఎంపీల ద్వారా తనను రెండుసార్లు సంప్రదించారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు. ‘‘నేను పార్లమెంటులో ప్రశ్నించకుండా ఉండేందుకు డబ్బులిస్తానని గత మూడేళ్లలో ఇద్దరు లోక్ సభ ఎంపీల ద్వారా నన్ను సంప్రదించారు. ఆ ఒప్పందాన్ని నేను తిరస్కరించాను’’ అని ఎంపీ చెప్పారు.

Also Read :  Badruddin Ajmal : అత్యాచారం, దోపిడీ కేసుల్లో ముస్లింలు నంబర్ వన్…అసోం ముస్లిం నేత బద్రుద్దీన్ అజ్మల్ వివాదాస్పద వ్యాఖ్యలు

డబ్బులు తీసుకొని అదానీకి వ్యతిరేకంగా ప్రశ్నలు వేశారని వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఎంపీ మహువా ఈ వ్యాఖ్యలు చేశారు. తానెప్పుడూ అదానీని కలవలేదని, తాను ప్రశ్నించకుండా ఉండేందుకు డబ్బులు ఆఫర్ చేశారని ఎంపీ ఆరోపించారు. అదానీ గత వారం తనను మళ్లీ సంప్రదించారని ఆమె చెప్పారు. ఎన్నికలు ముగిసే వరకు ఆరు నెలల పాటు నిశ్శబ్ధంగా ఉండాలని అదానీ కోరారని మహువా వివరించారు.