అమ్మాయిలు నచ్చినవారితో నచ్చినచోట ఉండొచ్చు: ఢిల్లీ హైకోర్టు

అమ్మాయిలు నచ్చినవారితో నచ్చినచోట ఉండొచ్చు: ఢిల్లీ హైకోర్టు

DELHI: ఢిల్లీ హైకోర్టు ఓ కీలక కేసులో ప్రత్యేకమైన తీర్పు వెల్లడించింది. మేజర్ అయిన మహిళ ఆమెకు నచ్చిన చోటు ఉండొచ్చు.. అని జస్టిసెస్ విపిన్ సంఘీ, రజ్నీష్ భట్‌నగర్‌తో కూడిన బెంచ్ నవంబర్ 24న తీర్పునిచ్చింది. ఈ కేసులో 20ఏళ్ల యువతి పెళ్లి చేసుకోవడానికి ఇల్లు వదిలి వెళ్లింది. ఆమె సోదరుడు ఆమెను కిడ్నాప్ చేశారంటూ కంప్లైంట్ చేశారు.

ఈ వాదనను వినేందుకు ఏర్పాటైన బెంచ్ వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా సమావేశమైంది. సులేఖ అనే యువతి తనకు కావాలనుకుంటే బబ్లూతో కలిసి ఉండొచ్చు. దాంతో పాటు సులేఖ తల్లిదండ్రులు చట్టం చేతిలోకి తీసుకుని యువతిని తమ వద్దే ఉండాలంటూ ఇబ్బంది పెట్టకూడదని చెప్పింది. ఈ మేరకు యువతి సోదరుడికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చింది.



అంతేకాకుండా వారి ఇంటి దగ్గర్లో ఉండే పోలీస్ స్టేషన్ బీట్ కానిస్టేబుల్ నెంబర్ ఇచ్చి అతనితో తరచూ టచ్ లో ఉండమని, ఏదైనా అవసరముంటే వెంటనే సంప్రదించాలని సూచించాం. సెప్టెంబర్ 12న కనిపించకుండా పోయిన యువతి గురించి ప్రవీణ్ కిడ్నాప్ కేస్ ఫైల్ చేశాడు. తన సోదరిని కచ్చితంగా కోర్టు ముందు హాజరపరచాలని పేర్కొన్నాడు.

వాదనకు హాజరైన సులేఖ తాను బబ్లూని పెళ్లి చేసుకునేందుకే ఇంటి నుంచి వచ్చేశానని చెప్పింది. లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ బిల్ పాస్ చేసిన తర్వాత ఈ తీర్పు రావడంతో కాస్త శోచనీయాంశంగా మారింది. అంతకంటే ముందు అలహాబాద్ హైకోర్టు కేవలం పెళ్లి కోసమే మతం మారడమనేది చెల్లని విషయం అని, అది అంగీకరించడానికి ఒప్పుకునే అంశం కాదని చెప్పింది. ఈ మార్పిడి అనేది చెల్లినా చెల్లకపోయినా ఇద్దరు వ్యక్తులు కావాలనుకుంటే కలిసి ఉండొచ్చని చట్టాలు చెబుతున్నాయి.