పెళ్లి పత్రికపై క్యూఆర్ కోడ్ : అతిథులు.. గిఫ్ట్ క్యాష్ ట్రాన్స్ ఫర్ చేయండి

పెళ్లి పత్రికపై క్యూఆర్ కోడ్ : అతిథులు.. గిఫ్ట్ క్యాష్ ట్రాన్స్ ఫర్ చేయండి

wedding card కరోనా వైరస్ మహమ్మారి కారణంగా, వివాహం లేదా ఆన్‌లైన్‌లో ఏదైనా ఫంక్షన్ వరకు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ప్రజలు అనేక కొత్త ఆలోచనలను అవలంబిస్తున్నారు. పెళ్లిళ్లలో చదివింపులు(పెళ్లిలో వధూవరులకి డబ్బులు ఇవ్వడం)సాధారణమే అన్న విషయం తెలిొసిందే. అయితే ప్రస్తుత డిజిట‌ల్ యుగంలో పెళ్లి చదివింపులు కూడా డిజిట‌లైజ్ అయిపోయాయి.

త‌మిళ‌నాడులోని మ‌ధురైలో ఓ కుటుంబం వెరైటీ పెళ్లి ప‌త్రిక‌ను ప్ర‌చురించింది. త‌మ కూతురి పెళ్లి కోసం .. వివాహ ముహూర్త ఆహ్వాన ప‌త్రిక‌పై క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. ఆ పెళ్లి ప‌త్రిక ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. గూగుల్ పే, ఫోన్ పే క్యూఆర్ కోడ్‌ల‌ను ఆ ప‌త్రిపై ప్రింట్ చేశారు. పెళ్లికి వ‌చ్చిన అతిథులు కానీ..కరోనా వల్ల పెళ్లికి హాజరుకాలేనివారు తమ ఇంటి నుంచే ఆ క్యూఆర్ కోడ్‌ల ద్వారా పెళ్లి చదివింపులు ఇచ్చుకునే అవ‌కాశం క‌ల్పించారు.

కొత్త జంట‌కు కానుక‌లు ఇవ్వాల‌నుకున్న వారు.. గూగుల్ పే లేదా ఫోన్‌పే ద్వారా నేరుగా బ్యాంక్ అకౌంట్‌లోకి అమౌంట్‌ను ట్రాన్స్‌ఫ‌ర్ చేసే వీలు క‌ల్పించారు. అయితే పెళ్లికి వ‌చ్చిన 30 మంది అతిథులు ఈ స‌దుపాయాన్ని వినియోగించుకున్నారు. వెడ్డింగ్ ప్ర‌జెంట్‌గా న‌గ‌దు ఇచ్చేందుకు క్యూఆర్ కోడ్‌ల‌ను వాడుకున్నారు. ఆదివారం ఈ పెళ్లి వేడుక జ‌రిగింది.