ఇంజినీర్లూ..తాళ్లతో రెడీగా ఉండండి : సీఎం కాన్వాయ్‌కి ఆవులు అడ్డురాకూడదు

  • Published By: veegamteam ,Published On : January 28, 2020 / 10:40 AM IST
ఇంజినీర్లూ..తాళ్లతో రెడీగా ఉండండి : సీఎం కాన్వాయ్‌కి ఆవులు అడ్డురాకూడదు

యూపీ సీఎం యోగీఆదిత్యానాథ్ కాన్వాయ్‌కు గోవులు, ఇతర జంతువులు అడ్డురాకుండా ఇంజనీర్లు చూసుకోవాలని ఆదేశించారు. అంతేకాదు..ఆ తొమ్మిదిమంది ఇంజినీర్లకు పశువుల్ని కట్టేయటానికి తాళ్లు కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ వార్తలు ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపుతున్నాయి. 

యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ బుధవారం (జనవరి 29,2020) మీర్జాపూర్‌లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో అక్కడి పీడబ్ల్యూడీ డిపార్టెమెంట్ ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిసింది. జంతువులు రోడ్లపైకి రాకుండా చూసేందుకు ఇంజినీర్లుకు తాళ్లు కూడా ఇచ్చింది. 
 
దీనిపై ఇంజినీర్లు సంఘం..అభ్యంతరం చెబుతూ  పీడబ్ల్యూడీ శాఖకు లేఖ రాసింది. జంతువులను అదుపు చేసే విషయంలో ఇంజినీర్లకు ఏమాత్రం అనుభవం ఉండదని, వారికేమైనా ఎవరిది బాధ్యత? అంటూ ప్రశ్నించింది. ఇటువంటి పనులు మరేదైనా శాఖకు  అప్పగించాలని సూచించింది. ఇక.. ఐదు రోజుల పాటు జరిగే గంగా యాత్రలో భాగంగా బుధవారం సీఎం యోగీ మిర్జాపూర్‌కు రానున్నారు. బిజ్నొర్‌లో సోమవారం (జనవరి 27)ఈ యాత్ర ప్రారంభమైంది. దీంట్లో భాగంగా సీఎం కాన్వాయ్ కు పశువులు ఏమాత్రం అసౌకర్యం కలిగించకుండా ఉండేలా పీడబ్ల్యూడీ ఈ ఆదేశాలు జారీ చేసింది. 

కాగా..యూపీలో చిత్ర విచిత్రమైన ఆదేశాలు జారీ అవుతున్నాయి. యూపీలోని సిద్దార్థనగర్‌లో  సీఎం యోగీ ఆదిత్యానాథ్ ఆధ్వర్యంలో సామూహిక వివాహ యోజన కార్యక్రమంలో భాగంగా.. జరగనుంది. ఈ సామూహిక వివాహాలకు చెందిన పెళ్లికూతుళ్లకు ముస్తాబు చేసే బాధ్యతను 20 మంది మహిళా టీచర్లకు అప్పగిస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేశారు. ఆ టీచర్లు ఉదయం 9 గంటలకల్లా వివాహాలు జరిగే ప్రాంతానికి చేరుకోవాలని ఉంది. విద్యాశాఖ జారీ చేసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావటం..తద్వారా పలు విమర్శలు రావటంతో ఆ ఆదేశాలను రద్దు చేశారు. ఈ క్రమంలో సీఎం కాన్వాయ్ కు పశువులు అడ్డురాకుండా ఇంజనీర్ల వాటిని కంట్రోల్ చేసేలా తాళ్లు కూడా ఇవ్వటం విమర్శలకు దారి తీస్తోంది.