Car Firecrackers : వీడి పైత్యం పాడుగాను.. లక్ష సీమటపాకాయలతో కారును అలంకరించి నిప్పంటించాడు.. వీడియో వైరల్

దీపావళి సందర్భంగా కారును ఏకంగా లక్ష టపాసులతో అలంకరించాడు. కారు చుట్టూ లక్ష టపాసులు పేర్చాడు. ఆ తర్వాత వాటికి నిప్పంటించాడు.

Car Firecrackers : వీడి పైత్యం పాడుగాను.. లక్ష సీమటపాకాయలతో కారును అలంకరించి నిప్పంటించాడు.. వీడియో వైరల్

Car Firecrackers : పుర్రెకో బుద్ధి జిహ్వాకో రుచి.. ఎవడి పిచ్చి వాడికి ఆనందం.. పిచ్చి పీక్స్.. అంటే.. ఇదే కాబోలు.. అని అనకుండా ఉండలేరు. దీపావళి సందర్భంగా ఓ యూట్యూబర్‌ చేసిన పని అందరినీ విస్తుపోయేలా చేసింది. ఇదేం తిక్కరా నాయనా, వీడెవడండి బాబూ అని అనుకునేలా చేసింది.

అందరిలా మనం కూడా బాణాసంచా కాలిస్తే కిక్కు ఏముందిలే అనుకున్నాడో మరో కారణమో కానీ.. డిఫరెంట్‌గా థింక్‌ చేశాడు. రాజస్తాన్‌లోని అల్వార్‌కు చెందిన యూట్యూబర్‌ అమిత్‌ శర్మ.. కొత్తగా ఏం చేద్దామా అని ఆలోచించి.. ఓ కారును టార్గెట్‌ చేశాడు. దీపావళి సందర్భంగా ఆ కారును ఏకంగా లక్ష టపాసులతో అలంకరించాడు. కారు చుట్టూ లక్ష టపాసులు వరసగా పేర్చాడు. ఆ తర్వాత బాంబులను పేల్చాడు.

దీంతో కాసేపు ఆ ప్రాంతమంతా క్రాకర్స్ శబ్ధంతో మారుమోగిపోయింది. బాంబులు పేలడంతో కారు కలర్‌ మొత్తం మారిపోయింది. పేలిన టపాసుల ధాటికి కారు గ్లాస్‌ పగిలిపోయింది. కానీ, ఇన్ని బాంబులు పేలినా కారు ఇంజిన్‌ పని చేయడం విశేషం. కాసేపటి తర్వాత యూట్యూబర్‌ మళ్లీ కారును స్టార్ట్‌ చేసి డ్రైవింగ్‌ చేస్తూ తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదేం తిక్కరా నాయనా? అని కొందరు తిడితే.. వీడెవడండి బాబూ అని మరికొందరు విస్తుపోతున్నారు. పిచ్చి పీక్స్ అంటే ఇదే అని ఇంకొందరు కామెంట్ చేశారు. వ్యూస్ కోసం, పాపులారిటీ కోసం ఇలాంటి పిచ్చి పనులు చేయడం కరెక్ట్ కాదని మరికొందరు మండిపడ్డారు. ఇది చాలా డేంజర్ అని, ప్రాణాలతో చెలగాటం ఆడటం కరెక్ట్ కాదని కొందరు హితవు పలికారు. ఇలాంటి చెత్త పనులతో సభ్య సమాజానికి ఏం మేసేజ్ ఇద్దామని సీరియస్ అవుతున్నారు.