Akhil Gogoi: రెండేళ్లుగా జైలులో ఉంటూ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచిన అఖిల్ గోగొయ్

అఖిల్ గోగొయ్ కోసం తల్లి ప్రియోదా గోగొయ్ చేసిన ప్రచారం బాగా పనికొచ్చింది. యాంటీ సీఏఏ సెంటిమెంట్లు స్థానికంగా ప్రభావం...

Akhil Gogoi: రెండేళ్లుగా జైలులో ఉంటూ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచిన అఖిల్ గోగొయ్

Akhil Gogoi

Akhil Gogoi: యాక్టివిస్ట్ అఖిల్ గోగొయ్.. డిసెంబర్ 2019 నుంచి జైలులో ఉన్నప్పటికీ ఇండిపెండెంట్ గా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి సురభి రాజ్కోన్వారీని 9వేల 64ఓట్లతో ఓడించాడు. యాంటీ సిటిజన్‌షిప్ (అమెండ్మెంట్) చట్టం గురించి జరిగిన ఆందోళనలో పాల్గొని అల్లర్లు సృష్టించాడని జైలులో ఉంచారు. అయినప్పటికీ కమ్యూనిస్ట్ ప్రభావిత ప్రాంతమైన సిబ్ సాగర్ లో పోటీ చేసి గెలిచాడు.

బీజేపీకి చెందిన సురభి రాజ్కోన్వారీని 9వేల 64ఓట్లతో ఇండిపెండెంట్ గా ఓడించాడు. అఖిల్ గోగొయ్ కోసం తల్లి ప్రియోదా గోగొయ్ చేసిన ప్రచారం బాగా పనికొచ్చింది. యాంటీ సీఏఏ సెంటిమెంట్లు స్థానికంగా ప్రభావం చూపించడంతో విజయం ఖాయమైంది. సోషియో పొలిటిక్ ఆర్గనైజేషన్ లో సభ్యుడిగా మాత్రమే కాకుండా సీపీఐ (మార్క్సిస్ట్-లెనినిస్ట్)తో కలిసి 1990 నాటి నుంచి పని చేస్తున్నాడు.

అస్సాం ఆర్థిక శాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ స్వయంగా అభినందనలు తెలియజేశారు. ఈ విజయంపై అఖిల్ గోగొయ్ కు కంగ్రాట్స్ చెబుతున్నాను. అతను నిర్మాణాత్మక ప్రతిపక్షంలో ఉంటాడని భావిస్తున్నానని పేర్కొన్నారు.

రాయ్జోర్ దల అనే పార్టీ పెట్టిన కొన్నాళ్లకే అఖిల్ గోగొయ్ జైలుకు వెళ్లారు. అతని మిత్ర పక్షమైన ఏజేపీ ఈస్టరన్ అస్సాం సీట్లలో ఓ మాదిరి విజయం మాత్రమే దక్కించుకుంది. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల తర్వాత మూడో స్థానంలో నిలిచింది ఏజేపీ.