Amazon: లోదుస్తులపై కన్నడ జెండా.. అమెజాన్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు

ప్రముఖ ఈ కామెర్స్ సంస్థ అమెజాన్ కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించింది. కన్నడ జాతీయ జెండా ముద్రించిన లో దుస్తులను అమెజాన్ తన వెబ్ సైట్ లో అమ్మకానికి పెట్టింది

Amazon: లోదుస్తులపై కన్నడ జెండా.. అమెజాన్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు

Amazon

Amazon: ప్రముఖ ఈ కామెర్స్ సంస్థ అమెజాన్ కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించింది. కన్నడ జాతీయ జెండా ముద్రించిన లో దుస్తులను అమెజాన్ తన వెబ్ సైట్ లో అమ్మకానికి పెట్టింది.  పసుపు, ఎరుపు రంగులతో కూడిన కన్నడ జాతీయ జెండాను ముద్రించిన లో దుస్తులను కెనడా అమెజాన్ ఆన్ లైన్ వెబ్ సైట్ లో పెట్టింది. దీనిపై కన్నడ ప్రముఖులు మండిపడుతున్నారు. వెంటనే అమెజాన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇక ఈ అంశంపై కర్ణాటక సాంస్కృతిక శాఖ మంత్రి అరవింద్ లింబావాలి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెజాన్ పై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. బహుళజాతి కంపెనీలు ఈ విధంగా కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బతీయడం మనోకోవాలని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే తమ ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం కన్నడ భాషను వికారమైన భాషగా చూపించింది గూగుల్. దీనిపై కన్నడ ప్రముఖులతోపాటు దేశ వ్యాప్తంగా ఉన్న భాష ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో గూగుల్ క్షమాపణలు చెప్పింది. ఇది జరిగిన రెండు రోజులకే అమెజాన్ ఈ విధంగా వ్యవహరించడంపై కన్నడ ప్రజలు మండిపడుతున్నారు. ఆన్ లైన్ వేదికగా తమ మనుభవాలను దెబ్బతీస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.