బుర్ఖా వేసుకుందని బూతులు తిట్టింది

బుర్ఖా వేసుకుందని బూతులు తిట్టింది

బుర్ఖా ధరించి ఉన్న భారత ముస్లిం మహిళా డాక్టర్‌ను తిట్టిన అమెరికన్ యువతిపై కేసు నమోదైంది. పూనె కంటోన్మెంట్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్లవర్ సెంటర్ మార్కెట్‌లో ఇరువురు మహిళలు షాపింగ్ చేస్తున్నారు. 

ముస్లిం మహిళను బుర్ఖా ఎవరు వేసుకుంటారని అమెరికన్ యువతి అడిగింది. దానికి సమాధానమిచ్చిన మహిళ ముస్లింలు వేసుకుంటారని సమాధానమిచ్చింది. అంతే తిట్ల పురాణం మొదలుపెట్టింది. బాధిత మహిళ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ చేసింది. 

ఎందుకు తిట్టావని పోలీసులు అడిగితే వారిని తిట్టింది. విషయాన్ని పోలీసులు అమెరికన్ ఎంబస్సీకి తెలియజేశారు. వివరాల కోసం ఆ మహిళను ఏ రాష్ర్టం నుంచి వచ్చిందని అడిగితే ఎంబస్సీ వారిని తిట్టింది. 

ఆశ్చర్యకరంగా ఆ మహిళ పూణెలో ఓ ముస్లిం వ్యక్తితో కలిసి ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈ సమస్య పరిష్కరించడానికి పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.కోర్టులో హాజరుపరచడానికి తమ వద్ద అరెస్టు వారెంట్ లేదని, కోర్టు అప్రూవల్ వస్తేనే ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగలమని పోలీసులు వెల్లడించారు.