చట్టాలన్ని చుట్టేశాడు.. ఆఖరి నిమిషం వరకు.. నిర్భయ రేపిస్ట్‌ల లాయర్ ఓడిపోయాడు

  • Published By: vamsi ,Published On : March 20, 2020 / 01:44 AM IST
చట్టాలన్ని చుట్టేశాడు.. ఆఖరి నిమిషం వరకు.. నిర్భయ రేపిస్ట్‌ల లాయర్ ఓడిపోయాడు

చట్టం పరిధిలో ప్రతి ఒక్కరు సమానమే.. వెయ్యి మంది దోషులు తప్పించుకున్నా… ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు. అనే రాజ్యంగ ప్రాథమిక సూత్రం నిర్భయ దోషులను చాలాసార్లు ఉరి నుంచి కాపాడింది. అయితే నిర్భయ రేపిస్ట్‌ల లాయర్ చట్టంలోని లొసుగులు అన్నీ చుట్టేసి చివరివరకు వారిని కాపాడేందుకు ప్రయత్నాలు చేశారు. ఉరి వాయిదాపై ఢిల్లీ హైకోర్టులో గురువారం అర్ధరాత్రి వరకు వాదనలు జరగ్గా.. కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది. తర్వాత అర్ధరాత్రి దాటిన తర్వాత లాయర్ ఏకంగా సుప్రీం కోర్టు తలుపులు తట్టారు. అయితే సుప్రీంకోర్టు కూడా పిటీషన్ కొట్టేసింది. (పాపం పండింది : నిర్భయ దోషుల ఎత్తులు..2013 – 2020 కొనసాగిన డ్రామాలు)

ఆ లాయర్ పేరే ఏపీ సింగ్.. సుప్రీం కోర్టు లాయర్ అయిన ఏపీ సింగ్‌ది మాస్టర్ బుర్ర… ఇంతకుముందే నిర్భయ తల్లి ఆశాదేవి వైపు వేలు పెట్టి చూపిస్తూ.. ‘‘ఈ కేసులో ఒక్కడినీ ఉరితీయనివ్వను… శాశ్వతంగా’’ అని సవాల్ విసిరాడు. ఈ విషయాన్ని ఆమె కూడా గతంలో చెప్పింది. నిర్భయ నిందితుల తరఫున గట్టిగా వాదించి, చట్టాల్లోని లొసుగులున్నీ వాడుకుంటూ కష్టపడ్డాడు. అయితే ఈ లాయర్ ఎక్కువగా వాదించేది హైఫై కేసులు, నొటోరియస్ క్రిమినల్స్ కేసులు మాత్రమే.

ఎలాగూ గెలవడు అని తెలిసినా కూడా వాయిదాలు మీద వాయిదాలు వేయిస్తూ.. అంతర్జాతీయ న్యాయస్థానం వరకు కూడా పోయ్యాడు. అయితే ఏం అయ్యింది చివరకు ఉరికొయ్యకు వ్రేలాడక తప్పలేదు. మన చట్టాల్లో ఎన్నిరకాల లొసుగులున్నాయో బయటపెట్టిన లాయరు.. ఒక కేసులో ఒకరికి మించి నిందితులుంటే, ఒకేసారి శిక్ష అమలు చేయాలి. అక్కడి నుంచి ఆ నిబంధన నుంచి అందరికీ ఉన్న అన్నిరకాల న్యాయ అవకాశాలూ పూర్తయ్యేదాకా ఎవరికీ శిక్ష అమలు చేయటానికి వీలు లేదని సుప్రీం నిబంధన వాడుకుని క్షమాభిక్ష పిటిషన్లను రాష్ట్రపతి తిరస్కరించాక కూడా మళ్లీ దిగువ కోర్టులో ఉరిశిక్షపై స్టే కోసం పిటిషన్లు వేశారు.

పిటిషన్ తిరస్కరణ తరువాత 15 రోజుల్లోపు ఉరి అమలు చేయవద్దని మరో నిబంధన ఉంది… దిగువ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు, రివ్యూ పిటిషన్, క్యురేటివ్ పిటిషన్, క్షమాభిక్ష పిటిషన్.. ఎన్నిరకాలు ఉన్నాయో అన్ని రకాలు మధ్యమధ్యలో నిందితుల వారీగా, వాయిదా పద్ధతుల్లో పిటిషన్లు వేస్తూ, మరికొంత జాప్యం చేస్తూ.. ఈలోపు ఇంకొన్ని లోపాలు వెతకుతూ.. చేయల్సినంత చేశాడు. అయినా చివరకు ఉరిని మాత్రం ఆపలేకపోయాడు. చివరకు ఓడిపోయాడు.(ఉరి ఎవరికి వేస్తారు? ఎందుకు వేస్తారు? మనదేశంలో ఎవరికి వేశారు?)