Bear Kills Couple : గుడిలో ప్రార్థనలు చేస్తుండగా ఘోరం.. దంపతులను చంపి తిన్న ఎలుగుబంటి

దైవ దర్శనం కోసం వెళ్లిన దంపతులపై ఎలుగుబంటి దాడి చేసి చంపేసింది. అంతేకాదు వారి శరీర భాగాలను ఛిద్రం చేసి తినేసింది.

Bear Kills Couple : గుడిలో ప్రార్థనలు చేస్తుండగా ఘోరం.. దంపతులను చంపి తిన్న ఎలుగుబంటి

Bear Kills Couple (2)

Bear Kills Couple : మధ్యప్రదేశ్ రాష్ట్రం పన్నా జిల్లాలో ఘోరం జరిగింది. దైవ దర్శనం కోసం వెళ్లిన దంపతులపై ఎలుగుబంటి దాడి చేసి చంపేసింది. అంతేకాదు వారి శరీర భాగాలను ఛిద్రం చేసి తినేసింది. ఇండోర్ లోని రాణిగంజ్ కు చెందిన ముకేశ్ రాయ్ తన భార్యతో కలిసి పన్నాలోని ఖర్మాయి మాత ఆలయానికి దర్శనం కోసం వెళ్లారు. గుడి దగ్గర ఉన్న దంపతులపై ఎలుగుబంటి దాడి చేసింది. స్థానికులు, అటవీశాఖ సిబ్బంది 5 గంటల పాటు శ్రమించి చివరికి ఎలుగును పట్టుకున్నారు.

పన్నా జిల్లా కేంద్రానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖర్మాయి ప్రాంతంలో ఉదయం 6.30 గంటలకు ఈ ఘటన జరిగింది. ఇక్కడి రాణిగంజ్ ప్రాంతానికి చెందిన ముకేశ్ ఠాకూర్ (50), ఇందిరా ఠాకూర్ (45) దంపతులు అడవిలోని దేవాలయానికి వెళ్లారు. ఆలయం దగ్గర దంపతులు ప్రార్థనలు చేస్తున్నారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఎలుగుబంటి వచ్చింది. వచ్చీ రాగానే దంపతులపై దాడి చేసి చంపేసింది. వారి శరీర భాగాలను తినింది. ఎలుగుబంటిని తరిమికొట్టేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

‘‘ మేం పన్నా టైగర్ రిజర్వ్ బృందాలకు సమాచారం అందించాం. ఎలుగుబంటిని పట్టుకొని, జంట మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం. ఎలుగుబంటిని తిరిగి అడవిలో వదిలేది లేదని, ఏదైనా జంతు ప్రదర్శనశాలకు పంపాలని చూస్తున్నాం’’ అని అటవీశాఖ అధికారి ఒకరు తెలిపారు.

Tiger Scare: 18 రోజులైనా చిక్కని పులి

దంపతులను చంపిన ఎలుగుబంటి వారి శరీరాలను దగ్గరలో ఉన్న చెరువు దగ్గరకు లాక్కెళ్లిందని, దాదాపు నాలుగు గంటల పాటు శరీర భాగాలు తిందని స్థానికులు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు చాలాసేపు కష్టపడి చివరికి ఆ ఎలుగుబంటిని బంధించారు. దానికి మత్తు మందు ఇచ్చి బంధించారు.

దైవ దర్శనానికి వెళ్లిన దంపతులపై ఎలుగు దాడి చేసి చంపడం, వారి శరీర భాగాలను కూడా తినడం స్థానికులను షాక్ కి గురి చేసింది. దంపతులను చంపి వారి శరీర భాగాలు తింటున్న ఎలుగుని కళ్లారా చూసిన స్థానికులు భయంతో వణికిపోయారు. కాగా, దైవ దర్శనానికి వెళ్లిన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం మృతుల కుటంబంలో తీవ్ర విషాదం నింపింది. ఘటన జరిగిన రెండు మూడు గంటల తర్వాత కానీ పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి రాలేదని మృతుడి బంధువులు తెలిపారు. కాగా, మృతుల పిల్లలకు చెరో రూ.4లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గౌరవ్ శర్మ తెలిపారు.