Air Asia Flight : ఎయిర్ ఏషియా విమానంలో సాంకేతిక లోపం..టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగివచ్చింది

ఎయిర్ ఏషియా విమానంలో సోమవారం సాంకేతిక లోపం ఏర్పడింది. కొచ్చి నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఎయిర్ ఏషియా విమానంలో సాంకేతిక లోపం కారణంగా తిరిగి కొచ్చి విమానాశ్రయానికి తిరిగి వచ్చింది....

Air Asia Flight : ఎయిర్ ఏషియా విమానంలో సాంకేతిక లోపం..టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగివచ్చింది

Air Asia Flight

Updated On : September 11, 2023 / 12:57 PM IST

Air Asia Flight : ఎయిర్ ఏషియా విమానంలో సోమవారం సాంకేతిక లోపం ఏర్పడింది. కొచ్చి నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఎయిర్ ఏషియా విమానంలో సాంకేతిక లోపం కారణంగా తిరిగి కొచ్చి విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. (Air Asia Flight) 168 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో కూడిన ఎయిర్ ఏషియా విమానం ఇక్కడి కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్ది నిమిషాలకే తిరిగి వచ్చిందని విమానాశ్రయ వర్గాలు సోమవారం తెలిపాయి. (Bengaluru-Bound Air Asia Flight)

Uddhav Thackeray : రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత మరో గోద్రా లాంటి ఘటన జరగొచ్చు…ఉద్ధవ్ థాకరే సంచలన వ్యాఖ్యలు

ఆదివారం అర్థరాత్రి బెంగళూరుకు బయలుదేరిన కొచ్చి-బెంగళూరు విమానం రాత్రి 11.15 గంటలకు టేకాఫ్ అయిన వెంటనే సాంకేతిక సమస్య తలెత్తింది. హైడ్రాలిక్ వైఫల్యం కారణంగా విమానం కొచ్చికి తిరిగి వచ్చిన తర్వాత విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. (Due To Technical Glitch)

 

అర్ధరాత్రి సురక్షితంగా విమానాశ్రయంలో దిగింది. ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. విమానం సురక్షితంగా ల్యాండింగ్ అయిన వెంటనే అత్యవసర పరిస్థితిని ఉపసంహరించుకున్నట్లు కొచ్చి విమానాశ్రయ అధికారులు తెలిపారు.