Amazon In India : భారత మార్కెట్‌ని .. అమెజాన్ అర్థం చేసుకోలేకపోతోందా? ఇండియన్ ఈ-కామర్స్ మార్కెట్‌లో ఎందుకు ఫెయిలవుతోంది?

ఇండియాలో ఎంతో ఆర్భాటంగా కార్యకలాపాలు ప్రారంభించిన అమెజాన్.. ఎనిమిదేళ్లు దాటినా కళ్లు చెదిరే లాభాలను కొల్లగట్టడంలో మాత్రం ఫెయిలైంది. పైగా.. ఫస్ట్ ప్లేస్‌లో దేశీయ కంపెనీ ఫ్లిప్ కార్ట్ ఉండటం.. అమెజాన్‌కు అస్సలు మింగుడుపడటం లేదు. ఈ-కామర్స్‌లో దిగ్గజ కంపెనీకి.. ఇండియాలో ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది? అమెజాన్‌కు.. ఎక్కడ తేడా కొడుతోంది?

Amazon In India : భారత మార్కెట్‌ని .. అమెజాన్ అర్థం చేసుకోలేకపోతోందా? ఇండియన్ ఈ-కామర్స్ మార్కెట్‌లో ఎందుకు ఫెయిలవుతోంది?

Bernstein’s report says Amazon India’s growth

Amazon  In India : ఇండియాలో ఎంతో ఆర్భాటంగా కార్యకలాపాలు ప్రారంభించిన అమెజాన్.. ఎనిమిదేళ్లు దాటినా కళ్లు చెదిరే లాభాలను కొల్లగట్టడంలో మాత్రం ఫెయిలైంది. పైగా.. ఫస్ట్ ప్లేస్‌లో దేశీయ కంపెనీ ఫ్లిప్ కార్ట్ ఉండటం.. అమెజాన్‌కు అస్సలు మింగుడుపడటం లేదు. ఈ-కామర్స్‌లో దిగ్గజ కంపెనీకి.. ఇండియాలో ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది? అమెజాన్‌కు.. ఎక్కడ తేడా కొడుతోంది?

అమెజాన్‌కు.. అమెరికా తర్వాత.. అతి పెద్ద మార్కెట్, వినియోగదారులు ఉన్న దేశం భారతే. అలాగే.. అమెజాన్ వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. అయితే.. దేశవ్యాప్తంగా ఎంతలా తన సేవలను విస్తరిస్తున్నా.. 50 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినా.. అదిరిపోయే లాభాలు గడించడం మాత్రం అమెజాన్‌కు సవాల్‌గా మారింది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న పట్టణాల్లో.. వ్యాపార విస్తరణకు ఫ్లిఫ్ కార్ట్ లాంటి ప్రత్యర్థి సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీ, విదేశీ సంస్థల వ్యాపారానికి ఉండే నిబంధనలే.. అమెజాన్‌కు లాభాలకు అడ్డుకట్టగా మారాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ-కామర్స్ రంగంలో తీవ్ర పోటీ, రెగ్యులేటరీ విధానాలు అనుకూలంగా లేకపోవడం అమెజాన్‌కు శాపంగా మారాయని.. అమెరికాకు చెందిన రీసెర్చ్ గ్రూప్ బెర్న్ స్టెయిన్ తెలిపింది.

ఈ- కామర్స్ రంగం వేగంగా వృద్ధి చెందుతున్న భారత్‌లో.. అమెజాన్ రిటైల్ వాటా 5 శాతంగానే ఉంది. అదే.. అంతర్జాతీయంగా చూసుకుంటే రిటైల్ వాటా 14 శాతంగా ఉంది. రాబోయే రెండేళ్లలో.. ఇండియాలో ఆన్ లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్య భారీగా పెరిగి.. 30 కోట్లు దాటుతుందనే అంచనాలున్నాయి. నిత్యావసరాల సరఫరాలో ఇప్పటికే క్విక్, ఇన్‌స్టంట్ డెలివరీలు పెరిగిపోయాయి. దీనిని.. అందిపుచ్చుకుంటేనే.. అమెజాన్‌కు అద్భుతమైన లాభాలు వస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 10 మినిట్స్‌, 20 మినిట్స్, 30 మినిట్స్ డెలివరీలంటూ చాలా కంపెనీలు దూసుకుపోతున్నాయి. గ్రాసరీ బిజినెస్‌లో బిగ్‌బాస్కెట్‌, బ్లింకిట్‌, జెప్టో, ఫ్లిప్‌కార్ట్‌ రైజింగ్‌లో ఉంటే.. వాటితో అమెజాన్‌ పోటీ పడలేకపోతోంది.

Amazon : అమెజాన్‌కు భారత్‌లో బేరాల్లేవమ్మా .. రూ.50 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినా రాని లాభాలు

మరో విషయం ఏమిటంటే.. ఎలక్ట్రానిక్స్, మీడియా రంగాల్లో అమెజాన్ ఆధిక్యం కొనసాగుతోంది. టైర్ వన్ నగరాల్లో.. అమెజాన్‌కు 50 లక్షల మంది ప్రైమ్ కస్టమర్లు ఉన్నారు. అయినా.. లాభాలు రావట్లేదు. ఇండియన్ మార్కెట్‌లోకి అడుగు పెట్టి.. ఎనిమిదేళ్లు దాటినా.. ఇంకా సెకండ్ పొజిషన్‌లోనే ఉంది అమెజాన్. అమెజాన్ గనక.. ఒక్కసారి ఇండియన్ ఈ-కామర్స్ మార్కెట్‌లో లీడ్ సాధిస్తే.. మిగతా ఏ దేశంలో రాని లాభాలు.. ఇక్కడే వస్తాయి. కానీ.. భారత్‌లో పోటీ చాలా ఎక్కువగా ఉంది. ఇందుకు.. దేశీ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిఫ్ కార్ట్ నుంచి ఉన్న గట్టి పోటీతో పాటు జియో కూడా క్రమంగా ఎదుగుతోంది. ఫ్యాషన్ రంగంలో అజియో గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తోంది. అంతేకాదు.. రిలయన్స్ మార్ట్‌ల ద్వారా డెలివరీ కూడా చాలా వేగంగా ఉంటోంది. ఇప్పటికే.. చిన్న పట్ణణాలకు కూడా రిలయన్స్ తన సేవలను విస్తరించింది. అందువల్ల.. డెలివరీ వేగంగా సాధ్యమవుతోంది. ఇవన్నీ.. అమెజాన్‌కు సవాల్‌గా మారాయ్. వీటికి తోడు.. అమెజాన్ సమస్యలు ఎదుర్కొంటున్న ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో.. మీషో వేగంగా అభివృద్ధి చెందడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

అమెజాన్.. విదేశీ సంస్థ కావడంతో ఇన్వెంటరీ మోడల్ అనుకూలించడం లేదు. షాపర్స్ స్టాప్, మోర్, ఎకోమ్ ఎక్స్‌ప్రెస్ లాంటి వాటిలో పెట్టుబడులు పెట్టినప్పటికీ.. వాటిపై పూర్తి నియంత్రణ సాధించలేకపోతోంది. స్వదేశీ సంస్థ కావడంతో.. ఇన్వెంటరీ లెడ్ మోడల్‌లో రిలయన్స్ దూసుకుపోతోంది. లక్షా 81 వేల కోట్లకు పైగా అమ్మకాలతో వాల్ మార్ట్, ఫ్లిప్‌కార్ట్..గతేడాది ఈ- కామర్స్ మార్కెట్‌లో టాప్ పొజిషన్‌లో ఉన్నాయ్. లక్షా 42 వేల నుంచి లక్షా 58 వేల కోట్లకు పైగా అమ్మకాలతో.. అమెజాన్ సెకండ్ పొజిషన్‌లో ఉంది. 36 వేల కోట్లకు పైగా అమ్మకాలతో.. రిలయన్స్ వీటి తర్వాతి స్థానంలో ఉంది. అయితే.. విదేశీ సంస్థలతో పోలిస్తే.. స్థానిక సంస్థలకు భారత్‌లో మార్కెట్ నిబంధనలు అనుకూలంగా ఉండడంతో అమెజాన్‌కు సమస్యలు ఎదురవుతున్నాయని బెయిర్‌స్టీన్ రిపోర్ట్ చెబుతోంది. ఏదేమైనా.. రాబోయే మూడేళ్లలో భారత మార్కెట్‌ని గనక అందిపుచ్చుకోగలిగితే.. అమెజానే ఇండియన్ ఈ-కామర్స్ మార్కెట్‌ లీడర్‌గా అవతరించే అవకాశం ఉంటుంది.