Bhagavad Gita Lessons in School బెంగాల్‌లో అధికారం ఇవ్వండి..స్కూల్లో భగవద్గీతను పాఠాలుగా చెప్పిస్తాం : బీజేపీ నేత

పశ్చిమ బెంగాల్‌ తమకు ఓటు వేసి అధికారం ఇస్తే భగవద్గీతను స్కూల్లో పాఠాలుగా చెప్పిస్తాం అంటూ బీజేపీ నేత సువేందు అధికారి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీజేపీని గెలిపిస్తే స్కూల్ సిలబస్‌లో భగవద్గీతను చేరుస్తాం అంటూ చెప్పుకొచ్చారు.

Bhagavad Gita Lessons in School బెంగాల్‌లో అధికారం ఇవ్వండి..స్కూల్లో భగవద్గీతను పాఠాలుగా చెప్పిస్తాం : బీజేపీ నేత
ad

Bhagavad Gita as lessons in school says Suvendu : పశ్చిమ బెంగాల్‌ తమకు అధికారం ఇస్తే భగవద్గీతను స్కూల్లో పాఠాలుగా చెప్పిస్తాం అంటూ బీజేపీ నేత సువేందు అధికారి వ్యాఖ్యానించారు. ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లాలో సోమవారం (ఆగస్టు9,2022) జరిగిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న బెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు సువేందు ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీని గెలిపిస్తే స్కూల్ సిలబస్‌లో భగవద్గీతను చేరుస్తాం అంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేసిన సువేంద్ భగవద్గీత మతగ్రంథం కాదు అంటూ చెప్పుకొచ్చారు.

ఇప్పటికే గుజరాత్‌ రాష్ట్రంలో భగవద్గీతను స్కూల్ సిలబస్‌లో చేర్చామని గుర్తు చేశారు. గుజరాత్ లో 6 తరగతి నుంచి 12వ తరగతి వరకు సిలబస్ లో భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చారనీ, ప్రజల ఆశీర్వాదంతో బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి వస్తే తప్పకుండా ఇక్కడ కూడా అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. ఈ రక్తదాన శిబిరంలో బీజేపీ నేతలు భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేశారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు టీఎంసీలో ఉన్న సువేందు ఆ తరువాత బీజేపీలో జాయిన్ అయ్యారు. ఎన్నికల్లో మమతపైనే పోటీ చేసి విజయం సాధించారు. ఇటీవల ఆయన మళ్లీ టీఎంసీ తీర్థం పుచ్చుకోబోతున్నారని ప్రచారం జరిగింది. ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన చాలామంది టీఎంసీ నేతలు ఆ తర్వాత మళ్లీ సొంతగూటికి వచ్చి చేరిన విషయం తెలిసిందే.

సువెందు అధికారి టీఎంసీలో ఉన్న సమయంలో మమతా బెనర్జీ అనుచరుడిగా ఉన్నారు. అంతేకాదు ఎకనమిక్ సెజ్‌లకు వ్యతిరేకంగా పోరాడిన రైతులకు అండగా పోరాడిన నాయకుడిగా మంచి గుర్తింపునందుకున్నారు. తరువాత ఎంపీగా, ఎమ్మెల్యేగా 2016లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రిగా వివిధ హోదాల్లో పని చేశారు. ఈక్రమంలో 2020 డిసెంబర్ 17న పార్టీకి రాజీనామా చేసి..డిసెంబర్ 19న కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మమతా బెనర్జీ పై 1,736 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు. మమతా ఓడినా సీఎం అయ్యారు. సువెందు మమతపై గెలిచినా ప్రతిపక్ష నేతగా ఉన్నారు.