Bharat Biotech Nasal Covid Vaccine : భారత్‌లో అందుబాటులోకి మరో కోవిడ్ వ్యాక్సిన్.. బూస్టర్ డోస్‌గా అందించనున్న కేంద్రం

భారత్ లో మరో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అదే ‘నాసల్ వ్యాక్సిన్’. దీన్ని భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసింది. కరోనా BF.7 Covid Variant గా రూపాంతరం చెంది మరోసారి విజృంభిస్తున్న వేళ ఈ వ్యాక్సిన్ ను ప్రజలకు బూస్టర్ డోస్ గా అందించనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ నాసల్ వ్యాక్సిన్ ను ప్రభుత్వం ముందుగా ప్రైవేటు ఆస్పత్రుల్లో అందుబాటులోకి తీసుకురానుంది.

Bharat Biotech Nasal Covid Vaccine : భారత్‌లో అందుబాటులోకి మరో కోవిడ్ వ్యాక్సిన్.. బూస్టర్ డోస్‌గా అందించనున్న కేంద్రం

Bharat Biotech Nasal Covid Vaccine

Bharat Biotech nasal Covid vaccine : భారత్ లో మరో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అదే ‘నాసల్ వ్యాక్సిన్’. దీన్ని భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసింది. కరోనా BF.7 Covid Variant గా రూపాంతరం చెంది మరోసారి విజృంభిస్తున్న వేళ ఈ వ్యాక్సిన్ ను ప్రజలకు బూస్టర్ డోస్ గా అందించనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ నాసల్ వ్యాక్సిన్ ను ప్రభుత్వం ముందుగా ప్రైవేటు ఆస్పత్రుల్లో అందుబాటులోకి తీసుకురానుంది.

భారత్ బయోటెక్ సంస్థ ముక్కు ద్వారా వేసే కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే నాసల్ వ్యాక్సిన్ వినియోగానికి కేంద్రం ఆమోదం తెలిపింది. దేశంలో అత్యవసరంగా వినియోగించాల్సిన సమయంలో ఈ నాసల్ వ్యాక్సిన్ BF.7 Covid Variant ఆందోళన వేళ ఈ వ్యాక్సిన్ ను బూస్టర్ డోస్ గా అందించనుంది.

భారత్ బయోటెక్ సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) – నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) సహకారంతో అభివృద్ధి చేసింది. ఈ నాసల్ వ్యాక్సిన్ ను ఇప్పటికే 4 వేల మంది వలంటీర్లపై పరీక్షించింది. క్లినికల్ ట్రయల్స్ లో నాసల్ వ్యాక్సిన్ సత్ఫలితాలను ఇచ్చింది. ఎక్కడా దుష్పరిణామాలు నమోదు కాలేదు. దీంతో భారత్ ప్రభుత్వం దీనికి ఆమోదాన్ని పలికింది. చింపాంజీ అడినోవైరస్ వెక్టార్ కు కొన్ని మార్పులు చేసి కొత్తగా ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసినట్టు భారత్ బయోటెక్ వెల్లడించింది.

కాగా, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ స్పందిస్తూ, భారత్ బయోటెక్ కరోనా నాసల్ వ్యాక్సిన్ కు డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) ఆమోదం తెలిపిందని వెల్లడించారు. దేశంలో 18 ఏళ్లకు పైబడినవారికి ఈ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అత్యవసర అనుమతులు లభించాయని వివరించారు. కరోనా మహమ్మారిపై భారత్ సాగిస్తున్న పోరాటాన్ని ఈ సూది రహిత వ్యాక్సిన్ మరింత ముందుకు తీసుకెళుతుందని మన్సుఖ్ మాండవీయ ఆశాభావం వ్యక్తంచేశారు.

కాగా కరోనా కొత్త వేరియంట్ (BF.7)చైనాలోనే కాకుండా జపాన్, అమెరికాలో సంచలనం సృష్టించింది. ఇప్పటికే కరోనా కొత్త వేరియంట్ ఆందోళనతో పలు దేశాలు అలర్ట్ అయ్యాయి. భారత్ కూడా అప్రమత్తమైంది. ప్రధాని మోడీ ఈ వేరియంట్ పై అత్యున్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రాలకు అప్రమత్తం చేశారు. రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని సూచించారు.ఇప్పటికే భారత్ లో BF.7 మూడు కేసులు నమోదుకావటంతో ఇటువంటి నిబంధనలుతప్పని చేశారు. ఇప్పటివరకు గుజరాత్‌లో మూడు, ఒడిశాలో ఒక కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా, అత్యవసర ఉపయోగం కోసం కొత్త నాసల్ కరోనా వ్యాక్సిన్‌ను కేంద్రం ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు.