Bihar : 40 మంది మహిళలకు ఒక్కడే భర్త .. అధికారులు షాక్

ఆ ప్రాంతంలో జీవించే మహిళలది ఓ వింత గాధ. వారి జీవితం, కులాలతో సంబంధం లేకుండా జీవించే విధానం వారికి ఓ కొత్త ఆలోచన వచ్చేలా చేసింది. అదే అందరికి ఒక్కటే భర్త ఉండాలని నిర్ణయించుకోవటం..

Bihar : 40 మంది మహిళలకు ఒక్కడే భర్త .. అధికారులు షాక్

40 womes only one husband

Bihar :  40 మంది మహిళలకు ఒక్కడే భర్తట..! వారి పిల్లలకు అతనే తండ్రికూడానట..!! ఒకే ప్రాంతానికి చెందిన 40మంది మహిళలు చెప్పింది విన్న అధికారులు షాక్ అయ్యారు. బీహార్‌లోని అర్వా‌ల్‌లోని వార్డు నంబర్ 7లో నివసించే 40మంది మహిళలు తమ భర్త పేరును రూప్‌చంద్ అని చెప్పారు. దీనిపై అధికారులు ఆరా తీయగా అసలు విషయం తెలిసి మరింత షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఒకే ప్రాంతానికి చెందిన 40మంది మహిళలు తమ భర్త పేరు తమ బిడ్డల పేరు రూప్‌చంద్‌గా ఎందుకు చెప్పారంటే..

అర్వా‌ల్‌లోని వార్డు నంబర్ 7లో సెక్స్ వర్కర్లు ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్నారు. బీహార్‌లో ప్రస్తుతం రెండో దశ కులగణను జరుగుతున్న క్రమంలో ప్రభుత్వ అధికారులు అర్వాల్‌లోని వార్డు నంబర్ 7కు వచ్చారు. వివరాలు సేకరిస్తున్నారు. దీంట్లో భాగంగా ప్రతీ ఇంటికి వెళ్లి కులం, విద్య, ఆర్థిక స్థితి, కుటుంబ స్థితిగతులు వంటి వివరాలు సేకరిస్తున్నారు. దీంతో రెడ్ లైట్ ఏరియాకు వచ్చిన అధికారులు వివరాలు సేకరిస్తుండగా..అక్కడ నివసించే 40 మంది మహిళలు.. తమ భర్త పేరు రూప్‌చంద్‌ అని చెప్పారు. వీరిలో చాలామంది వారి పిల్లలకు తండ్రి రూప్‌చంద్‌ అనే చెప్పారు. దీంతో అధికారులు షాక్ అయ్యారు. ఇదేదో తేడాగా ఉందని భావించిన అధికారులు ఆరా తీశారు.

కుల గణనలో భాగంగా అధికారులు వచ్చిన తమ భర్తల పేర్లు అడిగితే ఏం చెప్పాలని వారంతా అనుకున్నారు. అలా అందరు కలిసి రూప్ చంద్ అనే పేరు చెబుతామని అనుకున్నారు. అనుకున్నట్లుగానే అందరు తమ భర్తపేరు రూప్ చంద్ అనే చెప్పారు.ఇంతకీ రూప్‌చంద్‌ అంటే డబ్బుని అలా అంటారట. పాటలు పాడుతు..డ్యాన్సులు వేస్తూ జీవనం సాధించే అక్కడి మహిళలు రూపాయినే సర్వసంగా భావిస్తారు. ఆ రూపాయి కోసమే ఆడతారు,పాడతారు తమ బిడ్డల్ని బతికించుకోవానికి తాము జీవించటానికి సెక్స్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. అలాంటి రూపాయే తమకు భర్తగా భావించుకున్నారు. అలా అందరు కలిసి తమ భర్త పేరు రూప్‌చంద్‌ అని చెప్పారట.

మేమంతా కలిసి మెలిసి జీవిస్తున్నామని ఒకరికి కష్టమొస్తే మరొకరు అండగా ఉంటామని మాకు కులాలు మతాలు తెలివని చెప్పుకొచ్చారు. అక్కడి వివరాలు తెలుసుకున్న అధికారులు కూడా అదే చెబుతున్నారు అక్కడ నివసించేవారికి కులం అంటూ ఏదీ లేదని చెబుతున్నారు ఆ మహిళలు.