కమ్మగుంటది : కడక్ నాథ్ కోడి కూర

  • Published By: madhu ,Published On : January 9, 2019 / 08:43 AM IST
కమ్మగుంటది : కడక్ నాథ్ కోడి కూర

మధ్యప్రదేశ్ : ఖతర్నాక్ కోడి. రూపం నల్లనా.. రుచి కమ్మనా.. మధ్యప్రదేశ్‌ బ్రీడ్‌.. ఆదివాసీ జాతి కోడి.. వండుకుతింటే అద్భుతంగా ఉంటుంది. ఆ.. అంత అద్భుతం ఏముంది అందులో అనుకుంటున్నారా.. అయితే ఇది చదవండి…కోడికూర.. అదికూడా నల్లకోడి కూర.. మాంఛిగా మసాల దట్టించి వండితే ఉంటదీ.. ఆహా.. చెప్తుంటేనే నోరూరుతుంది కదూ..  ఇప్పుడు నాటుకోడి కూర కన్నా కడక్‌నాథ్ కోడికి  డిమాండ్‌ ఎక్కువగా ఉంది. కడక్‌నాథ్ కోడి.. నల్లగా ఉంటుంది. చికెన్‌ కలర్‌ కూడా నల్లగానే ఉంటుంది. కూర వండినా.. ముక్కలు నల్లగానే ఉంటాయి. కట్టెలపొయ్యిపై వండి.. షోర్వా పెడితే.. ఉంటది నా సామిరంగా.. చికెన్‌ ప్రియులైతే లొట్టలేసుకుని తింటారు.
పోషకాలు అధికం…
కడక్‌నాథ్ కోడి కూరలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ చికెన్‌తో రక్తహీనతను అరికడుతుందట. కొవ్వుశాతం చాలా తక్కువగా ఉంటుంది.  కడక్‌నాథ్‌ కోడి కాస్త కాస్ట్లీ.. రోజురోజుకు ఈ కోడికి డిమాండ్‌ పెరుగుతుండటంతో రేటు కూడా అదే స్థాయిలో పెరిగింద. కిలో కోడి ధర 800 ఉంటుంది. కోడిగుడ్డు ధర 50 రూపాయలు ఉంటుంది.
బోలెడంత ఆదాయం…
ఈ కోడి.. వినియోగదారులకు పోషకాలను ఇవ్వడమే కాదు.. వీటిని పోషించేవారికి బోలెడంత ఆదాయాన్ని ఇస్తుంది.  మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని బూడిదగడ్డ బస్తీకి చెందిన రాజేష్‌ గౌడ్‌ కడక్‌నాథ్‌ కోళ్ల పెంపకాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. ఒక్కో కోడిపిల్లకు  150 రూపాయలు పెట్టి కొనుగోలు చేశాడు. కడక్‌నాథ్‌ కోళ్లను పెంచుతున్నాడు. ఈయనతో పాటు మరికొంత మంది కూడా కడక్‌నాథ్ కోళ్లను పెంచుతున్నారు. ఒకరోజు వయసున్న కోడిపిల్లను తీసుకొచ్చి పెంచుతారు. ఏడాదిలో కిలో బరువు పెరగగానే 800లకు అమ్ముతారు.