హిస్టరీలో ఫస్ట్ టైమ్ : CISF డాగ్‌లకు గ్రాండ్ సెండాఫ్

  • Published By: veegamteam ,Published On : November 20, 2019 / 08:46 AM IST
హిస్టరీలో ఫస్ట్ టైమ్ : CISF డాగ్‌లకు గ్రాండ్ సెండాఫ్

సెంట్రల్‌ ఇండస్ట్రీయల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎస్‌ఎఫ్‌) చరిత్రలోనే తొలిసారి ఓ అరుదైన సందర్భానికి వేదికైంది. ఎనిమిది సంవత్సరాల నుంచి సేవలందించిన ఏడు డాగ్ లకు  సీఐఎస్‌ఎఫ్‌ గౌరవప్రదంగా వీడ్కోలు పలికింది. 

సీఐఎస్‌ఎఫ్‌ విభాగంలో పారామిలటరీ ఫోర్స్‌తో ఏడు శునకాలు విధులు నిర్వహించాయి. ఈ డాగ్ లకు వయసు పైబడింది. దీంతో వాటిని రిటైర్ చేశారు. అనంతరం మంగళవారం (నవంబర్ 19)న ఘనంగా వీడ్కోలు పలికారు. ఇంతకాలంపాటు సేవలందించిన ఏడు శునకాలకు మెమెంటోలు, మెడల్స్, సర్టిఫికెట్స్ లను ఇచ్చి  ఘనంగా సత్కరించారు. అనంతరం అంతే ఘనంగా వీడ్కోలు పలికారు.ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను సీఐఎస్‌ఎఫ్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. ఈసందర్భంగా శునకంగా జన్మించినా.. సైనికుడిగా పదవీ విరమణ అనే ట్యాగ్‌లైన్‌ను ఇచ్చింది.
కాగా..ఈ ఏడు డాగ్స్‌.. ఢిల్లీ మెట్రోలో విధులు నిర్వహించాయి. శునకాలకు పదవీవిరమణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం సీఐఎస్‌ఎఫ్‌ చరిత్రలో ఇదే తొలిసారి అని పారామిలటరీ ఫోర్స్‌ తెలిపింది. పదవీవిరమణ పొందిన ఈ ఏడు డాగ్స్ ను ఓ ఎన్‌జీవో సంస్థకు అప్పగించారు.