Maharashtra Politics : వాళ్ల కాళ్లూ చేతులు విరగ్గొట్టండి..బెయిల్ నేనిప్పిస్తా : షిండే వర్గం ఎమ్మెల్యే వ్యాఖ్యలు

వాళ్ల కాళ్లూ చేతులు విరగ్గొట్టండి..బెయిల్ నేనిప్పిస్తా అంటూ సీఎం షిండే వర్గం ఎమ్మెల్యే ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని ఉద్ధేశించి చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి.

Maharashtra Politics : వాళ్ల కాళ్లూ చేతులు విరగ్గొట్టండి..బెయిల్ నేనిప్పిస్తా : షిండే వర్గం ఎమ్మెల్యే వ్యాఖ్యలు

CM Shinde MLA Controversial comments

Maharashtra Politics : మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే ఎలాంటి పద్మవ్యూహాలు పన్ని సీఎం అయ్యారో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. రెబల్ ఎమ్మెల్యేలను కూడగట్టి బీజేపీ సహాయంతో పక్కా వ్యూహంతో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూలగొట్టి సీఎం పీఠాన్ని అధిరోహించారు. ఏక్ నాథ్ షిండే రెబల్ గా మారినప్పటినుంచి మహారాష్ట్రలో రాజకీయలు రసవత్తరంగా కొనసాగించి ఎట్టకేలకు సీఎం అయ్యారు షిండే. ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయాలు సాగించారు. అప్పటి నుంచి ఠాక్రే వర్గానికి..షిండే వర్గానికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఈక్రమంలో షిండే సీఎం అయ్యాక ఆయన వర్గం మరింతగా రెచ్చిపోతోంది. ఠాక్రే వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఇష్టానురీతిగా మాట్లాడుతోంది. దీంట్లో భాగంగానే షిండే వర్గం ఎమ్మెల్యే ఓ అడుగు ముందుకేసీ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Also read :  Maharashtra: ప్రజల నిర్ణయం మేరకే ప్రభుత్వం ఏర్పడింది: మహా సీఎం షిండే

షిండే వర్గంలోని ఎమ్మెల్యే ప్రకాశ్‌ సుర్వే ముంబయిలోని మాగాఠణే ప్రాంతంలోని ప్రాంతంలోని కోకాని పద బుద్ధ విహార్‌లో ఆగస్టు 14న జరిగిన ఓ కార్యక్రమంలో ఠాక్రే వర్గం వారిని ఉద్ధేశించి మాట్లాడుతూ.. ‘‘మీకు అడ్డుపడితే వాళ్ల కాళ్లు విరగ్గొట్టండి.. అవసరమైతే నేను బెయిల్‌ ఇప్పిస్తా’’ అంటూ వ్యాఖ్యానించారు. సుర్వే వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. సువ్వే చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.‘‘ఎవరిది నిజమైన శివసేన? దీని గురించి మీకు ఎవరైనా ఏమైనా చెబితే గట్టిగా జవాబు చెప్పండి. ఎవరి దాదాగిరీని సహించేది లేదు. అవసరమైతే వారిని కొట్టండి. మీకు ప్రకాశ్‌ సుర్వే ఉన్నాడు. వాళ్ల చేతులు విరగొట్టలేకపోతే కాళ్లు విరగ్గొట్టండి. ఆ తర్వాత రోజు నేనొచ్చి మీకు బెయిల్‌ ఇప్పిస్తా’’ అంటూ కార్యకర్తలతో రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారు. మేము ఎవరి జోలికీ వెళ్లం..కానీ మా జోలికి ఎవరైనా వస్తే మాత్రం వదిలిపెట్టేది లేదు అంటూ హెచ్చరించారు.

ఈ వ్యాఖ్యల వీడియో వైరల్‌గా మారడంతో ఠాక్రే వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే ప్రకాశ్‌ సుర్వేపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఠాక్రే వర్గంతో పాటు ప్రతిపక్ష ఎన్సీపీ నేడు మీడియా సమావేశం నిర్వహించనుంది. మరోపక్క సీఎం షిండే కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడనున్నట్లుగా సమాచారం.అటు షిండే వర్గం..ఇటు ఉద్థవ్ ఠాక్రే వర్గం అసలైన శివసేన తమది అంటే తమది అంటూ కోర్టుకెక్కారు. అసలైన శివసేన తమదేనంటూ శిందే వర్గం ఈసీని కోరగా.. ఠాక్రే వర్గం ఖండించింది. ఈ వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టు వద్ద పెండింగ్‌లో ఉంది.