ప్రశాంత్‌ కిషోర్‌పై చీటింగ్‌ కేసు

  • Published By: vamsi ,Published On : February 27, 2020 / 08:05 AM IST
ప్రశాంత్‌ కిషోర్‌పై చీటింగ్‌ కేసు

పాట్నాలోని పటాలిపుత్ర పోలీస్ స్టేషన్‌లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌పై మోసం, కంటెంట్ దొంగతనం కేసు నమోదైంది. ప్రశాంత్ కిషోర్ తన ‘బాత్ బీహార్‌కి’ ప్రచారానికి తన కంటెంట్‌ను ఉపయోగించుకున్నారంటూ శశ్వత్ గౌతమ్ అనే యువకుడు కేసు పెట్టాడు. దీంతో ప్రశాంత్ కిశోర్‌పై ఐపీసీ సెక్షన్ 420(మోసం చెయ్యడం) మరియు 406 (నమ్మకాన్ని ఉల్లంఘిండం) కింద కేసు నమోదైంది. 

జేడీయూకు రాజీనామా చేసిన తర్వాత..  ఫిబ్రవరి 20 నుంచి బాత్‌ బీహార్‌ కీ అనే కార్యక్రమం చేపట్టేందుకు ప్లాన్ చేసుకున్నారు ప్రశాంత్ కిషోర్. ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని వెల్లడించాడు. అయితే ఈ కార్యక్రమాన్ని కాపీ కొట్టారంటూ గౌతమ్ అంటున్నాడు.

దీంతో విచారణ ప్రారంభించిన పోలీసులు.. కిషోర్‌పై చీటింగ్‌ కేసు నమోదు చేశారు. తాను బీహార్‌ కీ బాత్‌ అనే కార్యక్రమాన్ని ఈ ఏడాది జనవరి నెలలో ప్రారంభించానని, దాన్ని ప్రశాంత్‌ కిషోర్‌ కాపీ కొట్టి ఫిబ్రవరి నెలలో స్టార్ట్ చేస్తున్నాడంటూ ఫిర్యాదు చేశాడు గౌతమ్. 

పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం, జాతీయ పౌర ప‌ట్టిక(ఎన్ఆర్సీ)కి వ్య‌తిరేకంగా ప్రచారం నిర్వహిస్తానని ప్రశాంత్ కిషోర్ ఈ నెల 18న ప్రకటించారు. బీహార్‌కు కొత్త నేత అవ‌స‌రం అంటూ ఈ కార్యక్రమం మొదలు పెట్టిన ప్రషాంత్ కిషోర్.. రాబోయే వంద రోజుల్లో కోటి మంది యువ‌త‌ను త‌మ ఉద్య‌మంలో భాగం చేస్తానంటూ ప్రకటించారు.