CDS Chopper Crash : రాజ్ నాథ్ చేతిలో..రావత్ హెలికాఫ్టర్ ప్రమాద రిపోర్ట్

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ కూలిపోవడంపై దర్యాప్తు జరిపిన త్రివిధ దళాల దర్యాప్తు బృందం బుధవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో

CDS Chopper Crash :  రాజ్ నాథ్ చేతిలో..రావత్ హెలికాఫ్టర్ ప్రమాద రిపోర్ట్

Cds

CDS Chopper Crash :  చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ కూలిపోవడంపై దర్యాప్తు జరిపిన త్రివిధ దళాల దర్యాప్తు బృందం బుధవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయింది. దర్యాప్తు వివరాలను ఆయనకు తెలియజేసినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలి

తమిళనాడులోని కూనూరు దగ్గర డిసెంబరు 8-2021న ఎయిర్ ఫోర్స్ కి చెందిన ఎంఐ-17వీ5 హెలికాఫ్టర్ కూలిపోయిన ఘటనలో దేశ తొలి త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్,ఆయన భార్యతో కలిపి మొత్తం 14మంది ప్రాణాలు కోల్పోయిన కూలిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాద ఘటనపై దర్యాప్తు జరిపిన త్రివిధ దళాల దర్యాప్తు బృందం…కేంద్ర ప్రభుత్వానికి తమ విచారణ నివేదికను సమర్పించింది. భారత వాయు సేనకు చెందిన ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలోని కోర్ట్ ఆఫ్ ఇంక్వైరీ దర్యాప్తులో వెల్లడైన వివరాలతో కూడిన నివేదికను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సమర్పించారు అధికారులు.

ఈ దర్యాప్తు బృందంలో భారత నావికా దళానికి చెందిన సీనియర్ హెలికాప్టర్ పైలట్ ఒకరు, సైనికాధికారి ఒకరు కూడా ఉన్నారు. మానవేంద్ర సింగ్ బెంగళూరులోని ఐఏఎఫ్ ట్రైనింగ్ కమాండ్‌కు అధిపతిగా ఉన్నారు. విమానాలు, హెలికాప్టర్లు కూలిపోయిన సంఘటనలపై దర్యాప్తు చేయడంలో మానవేంద్ర సింగ్ నిపుణుడు.

విచారణ బృందం అందించిన నివేదిక ప్రకారం… ఈ హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడానికి కారణం సాంకేతిక లోపం కాదు. హెలికాప్టర్ కూలిపోవడానికి ప్రతికూల వాతావరణమే ప్రధాన కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. Mi-17V5 ఛాపర్‌కు పైలట్‌గా ఉన్న వింగ్ కమాండర్ పృథ్వీ సింగ్ చౌహాన్, ప్రమాదానికి 8 నిమిషాల ముందు హెలికాప్టర్‌ను ల్యాండ్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రమాదానికి గురయ్యే ముందు ఈ హెలికాప్టర్ తక్కువ ఎత్తులో ప్రయాణిస్తోందని, ఓ రైల్వే లైను గుండా అది వెళ్తోందని, ఆ సమయంలో దట్టమైన మేఘాలు కమ్ముకుని ఉన్నాయని ఈ నివేదిక పేర్కొన్నట్లు సమాచారం.  దీనిలోని సిబ్బంది అత్యున్నత స్థాయి నిపుణులని, అయితే పరిస్థితిపై సరైన అవగాహన లేకుండా, పైలట్ నియంత్రణలో హెలికాప్టర్ ఉన్నప్పటికీ, అనుకోకుండా భూమిపైకి దించారని పేర్కొన్నట్లు సమాచారం. అన్ని కోణాల్లోనూ పరిశీలించి ఈ నివేదికను రూపొందించారని తెలుస్తోంది. హెలికాప్టర్ కూలిపోవడానికి ప్రతికూల వాతావరణమే ప్రధాన కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదిలావుండగా, సాయుధ దళాల ఉన్నతాధికారులు ప్రయాణించే హెలికాప్టర్లను నడిపేటపుడు పాటించవలసిన ప్రమాణాలను సవరించాలని ఈ రిపోర్ట్ సూచించినట్లు సమాచారం.

ALSO READ Cyber Crime: వెయ్యి కడితే పది వేలు, లక్ష కడితే ఐదు లక్షలు.. ఊరు ఊరునే మోసం చేసిన సైబర్ నేరగాళ్లు