నాగ్ పూర్ లో ఓటు వేసిన మంత్రి నితిన్ గడ్కరీ

  • Edited By: veegamteam , April 11, 2019 / 05:39 AM IST
నాగ్ పూర్ లో ఓటు వేసిన మంత్రి నితిన్ గడ్కరీ

ముంబై : మహారాష్ట్ర నాగ్‌పూర్‌ లోని పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 220లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరపున నితిన్‌ గడ్కరీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా దేశంలో లోక్ సభ ఎన్నికల పర్వం తొలి దశలో భాగంగా 91 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న క్రమంలో పలువురు నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాగా ఉదయం 9 గంటలకు అండమాన్, నికోబార్ దీవులలో 5.83 శాతం, అస్సాంలో 10.2 శాతం, అరుణాచల్ ప్రదేశ్లో 13.3 శాతం ఓటింగ్ నమోదయ్యింది. 

దేశ వ్యాప్తంలో సార్వత్రిక ఎన్నికలు తొలి దశ పోలింగ్ జరుగుతున్న క్రమంలో ప్రముఖులు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. తొలి విడతలో 20 రాష్ట్రాలలో లోక్ సభ స్థానాలకు ఎన్నికలు కొనసాగుతున్నాయి.