KCR Focus Maharashtra : 24 గంటలు ఉచిత విద్యుత్, కుటుంబానికి రూ.10లక్షలు.. మహారాష్ట్రపై ఫోకస్ పెంచిన కేసీఆర్

మహారాష్ట్రపై తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోకస్ పెంచారు. అప్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో జనంలోకి బీఆర్ఎస్ ను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ప్రతీ గ్రామంలో బీఆర్ఎస్ విస్తరణపై దృష్టి పెట్టారు. 10 రోజుల్లోనే బీఆర్ఎస్ కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి.

KCR Focus Maharashtra : 24 గంటలు ఉచిత విద్యుత్, కుటుంబానికి రూ.10లక్షలు.. మహారాష్ట్రపై ఫోకస్ పెంచిన కేసీఆర్

KCR Focus Maharashtra : మహారాష్ట్రపై తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోకస్ పెంచారు. అప్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో జనంలోకి బీఆర్ఎస్ ను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ప్రతీ గ్రామంలో బీఆర్ఎస్ విస్తరణపై దృష్టి పెట్టారు. 10 రోజుల్లోనే బీఆర్ఎస్ కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. మహారాష్ట్రలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని, ప్రతి దళిత కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే చెరుకు రైతులను ఆదుకునేలా నాందేడ్ సభలో కేసీఆర్ ప్రసంగం ఆసాంతం కొనసాగింది.

తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన తర్వాత మొదటిసారి తెలంగాణ దాటి బహిరంగ సభ నిర్వహించారు ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్‭లో నిర్వహించిన సభలో మాట్లాడుతూ జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల మీద తీవ్ర స్థాయిలో విరుచకుపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైనా దేశంలోని చాలా చోట్ల తాగు నీరు లేదని కేసీఆర్ విమర్శించారు. తాను రాజకీయం చేయడానికి రాలేదన్న కేసీఆర్.. దేశంలో మార్పు తీసుకొచ్చేందుకే బీఆర్ఎస్ ను దేశ వ్యాప్తంగా తీర్చిదిద్దున్నానని వివరించారు.

Also Read..MLA Raghunandan Rao : రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక స్థానాల్లో ఏపీ క్యాడర్.. తెలంగాణ వారికి అన్యాయం : ఎమ్మెల్యే రఘునందన్ రావు

”దేశంలో సమూల మార్పులు తీసుకొస్తాం. దేశ పరిస్థితులను చూశాక టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్ గా మార్చాం. తెలంగాణలో వచ్చిన మార్పు దేశమంతటా రావాల్సి ఉంది. భారత్ పేద దేశం కాదు. అమెరికా కంటే ధనిక దేశం. బుద్ధి జీవుల దేశం” అని కేసీఆర్ అన్నారు.

మహారాష్ట్రలోని నాందేడ్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ… తాము ఎన్నాళ్లో ఎదురు చూశామని, ఇప్పుడు సమయం వచ్చిందని, నాగలి పట్టే చేతులు.. శాసనాలు చేయాల్సిన టైం వచ్చిందని చెప్పారు. ఎన్నికల్లో అభ్యర్థులు కాదని, ప్రజలు, రైతులు గెలవాలని అన్నారు.

Also Read..BRS in Nanded: గులాబీమయమైన నాందేడ్.. 75 ఏళ్ల పాలనపై కేసీఆర్ విమర్శలు

దేశంలో వనరులు సమృద్ధిగా ఉన్నాయని చెప్పారు. దేశంలో ఉన్నంత సాగుయోగ్యమైన భూమి మరెక్కడా లేదని, కానీ ప్రజలు వంచనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో అనేక నదులు ఉన్నా నీటి కరువు ఎందుకని ప్రశ్నించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎన్నో కూటములు పాలన చేశాయని, కానీ మనదేశం ఆశించిన అభివృద్ధి సాధించలేదని అన్నారు. దేశంలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందని, దేశ నాయకత్వంలో మార్పు వస్తేనే ప్రగతి సాధ్యమని చెప్పారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.