BRS in Nanded: గులాబీమయమైన నాందేడ్.. 75 ఏళ్ల పాలనపై కేసీఆర్ విమర్శలు
ప్రపంచంలోని అనేక చిన్న దేశాలు ఎన్నో పెద్ద విజయాల్ని సాధిస్తున్నాయి. కానీ మనదేశంలో ఎన్నో వనరులు ఉన్నా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అమెరికా, చైనా కంటే మన దేశంలో తక్కువ వ్యవసాయ భూమి ఉంటుందని, అయినప్పటికీ అక్కడి రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవడం లేదు. మహారాష్ట్రలో సైతం వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు

KCR slams congress and bjp at public meeting in Nanded
BRS in Nanded: భారత్ రాష్ట్ర సమితి పార్టీగా పేరు మార్చిన అనంతరం మొదటిసారి తెలంగాణ దాటి బహిరంగ సభ నిర్వహించారు ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు. ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో నిర్వహించిన ఈ సభలో మాట్లాడుతూ జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మీద తీవ్ర స్థాయిలో విరుచకుపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైనా దేశంలోని చాలా చోట్ల తాగు నీరు లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. తాను రాజకీయం చేయడానికి రాలేదని, కానీ దేశంలో మార్పు తీసుకువచ్చేందుకే భారాసను దేశ వ్యాప్తంగా తీర్చిదిద్దున్నానని ఆయన అన్నారు.
Adani Group : అదానీ గ్రూప్‌కు ఇచ్చిన రుణ వివరాలను వెల్లడించిన యాక్సిస్ బ్యాంక్ ..
‘‘ప్రపంచంలోని అనేక చిన్న దేశాలు ఎన్నో పెద్ద విజయాల్ని సాధిస్తున్నాయి. కానీ మనదేశంలో ఎన్నో వనరులు ఉన్నా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అమెరికా, చైనా కంటే మన దేశంలో తక్కువ వ్యవసాయ భూమి ఉంటుందని, అయినప్పటికీ అక్కడి రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవడం లేదు. మహారాష్ట్రలో సైతం వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎన్నో నదులు ఉన్నప్పటికీ మహారాష్ట్ర రైతు గొంతు ఎందుకు ఎండుతోంది. 75 ఏళ్లు దేశాన్ని ఏలినవారు ఎందుకు రైతు ఆత్మహత్యలపై మాట్లాడరు’’ అని కేసీఆర్ నిలదీశారు.
UP Politics : భారతదేశ ప్రతిష్ట ప్రమాదంలో ఉంది.. అదానీ వ్యవహారంపై మాయావతి కీలక వ్యాఖ్యలు..