UP Politics : భారతదేశ ప్రతిష్ట ప్రమాదంలో ఉంది.. అదానీ వ్యవహారంపై మాయావతి కీలక వ్యాఖ్యలు..

భారతదేశ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ వ్యవహారంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీ సమస్య కారణంగా భారతదేశం ప్రతిష్ట ప్రమాదంలో ఉందని, కానీ, కేంద్ర ప్రభుత్వం దానిని చాలా తేలిగ్గా తీసుకుంటోందని మాయావతి అన్నారు.

UP Politics : భారతదేశ ప్రతిష్ట ప్రమాదంలో ఉంది.. అదానీ వ్యవహారంపై మాయావతి కీలక వ్యాఖ్యలు..

Mayawati

UP Politics : గౌతమ్ అదానీ సమస్య కారణంగా భారతదేశం ప్రతిష్ట ప్రమాదంలో ఉందని, కానీ, కేంద్ర ప్రభుత్వం దానిని చాలా తేలిగ్గా తీసుకుంటోందని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. ఆదివారం అదానీ అంశంపై.. మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీ కేసు భారత ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం అదానీకి మద్దతుగా నిలుస్తూ దేశ ప్రజలను ప్రభుత్వం విశ్వాసంలోకి తీసుకోకపోవటం బాధాకరమని వ్యాఖ్యానించారు. ప్రపంచ కుబేరుల జాబితాలో తన ర్యాంకును నిలబెట్టుకున్న భారత వ్యాపారవేత్త కారణంగా.. ఇప్పుడు దేశ ఆర్థిక ప్రపంచం నిరాశకు లోనైందని ఆమె అన్నారు.

Mayawati on Budget2023: పార్టీ కోసం కాకుండా దేశం కోసం పెట్టుంటే బాగుండేది.. కేంద్ర బడ్జెట్‭పై మాయావతి సెటైర్స్

అదానీ వ్యవహారం దేశ ఆర్థిక వ్యవస్థపైన, సామాన్య ప్రజల జీవనంపైనా దీర్ఘకాలిక ప్రభావం చూపనుందని, ప్రభుత్వం మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటం బాధాకరమని ఆమె వ్యాఖ్యానించారు. ఇదిలాఉంటే.. ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానంకు చేరుకున్న భారత్ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యం హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికతో ఒక్కసారిగా కుప్పకూలిన విషయం విధితమే. అదానీ గ్రూప్ షేర్లు అత్యధిక దిగువ స్థాయికి పడిపోయాయి. హిండెన్‌బర్గ్ నివేదిక బయటకొచ్చిన పది రోజుల్లోనే అదానీ గ్రూప్ సంస్థలు భారీ నష్టాలను చవిచూశాయి. పదిరోజుల్లో ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానం నుంచి 22వ స్థానంకు అదానీ పడిపోయాడు.

Mayawati: వచ్చే ఎన్నికలపై కీలక ప్రకటన చేసిన మాయావతి

బీఎస్పీ అధినేత్రి మాయావతి అంతకుముందు ట్విటర్ ద్వారా ఆధ్యాత్మిక కవి సంత్ రవిదాస్ కు నివాళులర్పించారు. రాజకీయ ప్రయోజనాలకోసమే కాకుండా సంత్ రవిదాస్ చూపిన మార్గంలోకూడా పాలకపక్షాలు నడుచుకోవాలని మాయావతి కోరారు. పాలకులు తమ సంకుచిత రాజకీయ ప్రయోజనాలకోసమే సెయింట్ గురు రవిదాస్ జీకి నమస్కరించడం కాదని, అతని భావాల పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలని, ఇదే అతనికి నిజమైన నివాళి అని ఆమె ట్వీటర్ ద్వారా తెలిపారు.