Adani Group : అదానీ గ్రూప్‌కు ఇచ్చిన రుణ వివరాలను వెల్లడించిన యాక్సిస్ బ్యాంక్ ..
ఆర్బీఐ ఆదేశాల ప్రకారం.. అదానీ గ్రూప్‌కు ఎంతమేర రుణం ఇచ్చామనే విషయాన్ని యాక్సిస్ బ్యాంక్ వెల్లడించింది. అయితే, అదానీ గ్రూపులకు ఇచ్చిన రుణం వసూలుపై తమకు ఎలాంటి ఆందోళన లేదని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది.

Adani Group
Adani Group : అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ నివేదిక తరువాత అదానీ గ్రూప్ షేర్లు భారీగా పడిపోయాయి. అదానీ గ్రూప్ కంపెనీలు మోసాలకు పాల్పడుతున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా షేర్ల విలువను పెంచుకుంటున్నాయని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. దీంతో హిండెన్‌బర్గ్ నివేదిక ముందు వరకు ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానంలోఉన్న అదానీ.. నివేదిక తరువాత భారీగా అదానీ గ్రూప్ షేర్లు పడిపోవటంతో పదిరోజుల్లోనే 22వ స్థానంకు పడిపోయాడు. మొత్తం 217 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో ప్రస్తుతం అదానీ 118 బిలియన్ డాలర్లను కోల్పోయాడు.
Adani Group : అదానీ కష్టాలు.. కొనసాగుతున్న షేర్ల పతనం, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలోనూ ఎదురు గాలి
అదానీ గ్రూప్ వ్యవహారంపై రిజర్వ్ బ్యాంకు దృష్టిసారించింది. అదానీ గ్రూపుకు ఇచ్చిన రుణాల వివరాలను వెంటనే తెలపాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. దీంతో ఎస్‌బీఐ అదానీ గ్రూపులకు 27వేల కోట్లు రుణం ఇచ్చినట్లు వివరాలు వెల్లడించింది. అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ. 7వేల కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 7వేల కోట్ల రుణాలు ఇచ్చినట్లు ఆర్బీఐకి తెలిపాయి. అయితే నిబంధనల ప్రకారమే రుణాలు ఇవ్వటం జరిగిందని, రుణ వసూలు విషయంలో మాకు ఎలాంటి ఆందోళన లేదని బ్యాంకులు వెల్లడించాయి.
Adani Group: హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. పది రోజుల్లో 118 బిలియన్ డాలర్లు కోల్పోయిన అదానీ గ్రూప్
తాజాగా యాక్సిస్ బ్యాంకుసైతం ఆర్బీఐకు అదానీ గ్రూప్‌కు ఇచ్చిన రుణాల వివరాలను వెల్లడించింది. ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంకు అదానీ గ్రూప్‌కు ఇచ్చిన రుణం 0.94 శాతంగా వెల్లడించింది. రెగ్యులేటరీ ఫైలింగ్ లో సమాచారం ఇస్తూ, సెక్యూరిటీ, బాధ్యత, రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యం ఆధారంగా మాత్రమే మేము ఏదైనా కంపెనీకి రుణ మొత్తాన్ని ఇస్తామని బ్యాంక్ తెలిపింది. అయితే, అదానీ గ్రూపులోని సంస్థలకు ఇచ్చిన రుణంపై మేము ఆందోళన చెందటం లేదని, వాటిని వసూలు చేసుకొనే విషయంలో దీమాగానే ఉన్నామని యాక్సిస్ బ్యాంక్ ఆర్బీఐకి వెల్లడించింది.