Adani Group: హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. పది రోజుల్లో 118 బిలియన్ డాలర్లు కోల్పోయిన అదానీ గ్రూప్

అమెరికా షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ సంచలన నివేదికతో అదానీ గ్రూప్ సంస్థల షేర్లు ఒక్కసారిగా పాతాళానికి పడిపోయాయి. ప్రపంచ బిలియనీర్స్ టాప్-3 స్థానంలో కొనసాగుతూ వచ్చిన అదానీ.. ఒక్కసారిగా 22వ స్థానంకు పడిపోయాడు. హిండెన్ బర్గ్ నివేదిక తరువాత పది రోజుల్లోనే అదానీ గ్రూప్స్ 118 బిలియన్ డాలర్లను కోల్పోయాయి.

Adani Group: హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. పది రోజుల్లో 118 బిలియన్ డాలర్లు కోల్పోయిన అదానీ గ్రూప్

Adani Groups

Adani Group: అమెరికా షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ సంచలన నివేదికతో అదానీ గ్రూప్ సంస్థల షేర్లు ఒక్కసారిగా పాతాళానికి పడిపోయాయి. ప్రపంచ బిలియనీర్స్ టాప్-10 స్థానంలో కొనసాగుతూ వచ్చిన అదానీ.. హిండెన్ బర్గ్ నివేదిక కారణంగా ఆ జాబితాలో స్థానం కోల్పోయాడు. హిండెన్‌బర్గ్ నివేదిక ప్రకారం.. అదానీ గ్రూప్ కృత్రిమంగా షేర్ల విలువను పెంచుతోందని, స్టాక్ మార్కెట్ లలో అవకతవకలకు పాల్పడుతోందని, అకౌంటింగ్ మోసాలు చేస్తోందని ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించినప్పటికీ, ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపలేక పోయింది. హిండెన్‌బర్గ్ నివేదికకు ముందు అదానీ 217 బిలియన్ డాలర్లు మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను కలిగి ఉన్నాడు. నివేదిక తరువాత పది రోజుల్లో అదానీ 118 బిలియన్ డాలర్లను కోల్పోయాడు. ఇంకా అదానీ గ్రూప్ షేర్ల పతనం కొనసాగుతూనే ఉంది.

Adani Group : అదానీ.. కొంపకొల్లేరు.. కొనసాగుతున్న షేర్ల పతనం, రూ.9లక్షల కోట్లకుపైగా నష్టం

హిండెన్ బర్గ్ నివేదికకు ముందు ఫోర్బ్స్ ప్రపంచ సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ మూడో స్థానంలో ఉన్నాడు. నివేదిక తరువాత పది రోజుల్లోనే (ఫిబ్రవరి 2 నాటికి) 22వ స్థానానికి పడిపోయాడు. హిండెన్‌బర్గ్ అనేది అమెరికా కేంద్రంగా కొనసాగుతున్న సంస్థ. 2017 సంవత్సరంలో నాథన్ ఆండర్సన్ ప్రారంభించారు. ఇది ఫోరెన్సిక్ ఫైనాన్షియల్ రీసెర్చ్‌లో ప్రత్యేకతను కలిగి ఉంది. ఈ సంస్థ ఇచ్చిన నివేదికను అధికశాతం మంది ఇన్వెస్టర్లు విశ్వసిస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా బడా కంపెనీలు, స్టార్టప్‌ల అక్రమాలు, దుర్వినియోగంపై పరిశోధన నివేదికలను ఈ సంస్థ విడుదల చేస్తుంది. హిండెన్‌బర్గ్ నివేదిక కారణంగా గతంలోనూ పలు సంస్థలు భారీ నష్టాల్లోకి వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి.

Adani Group: అదానీ గ్రూప్సులో భారీ క్రాష్.. ఒక్కసారిగా కుప్పకూలిన షేర్లు.. అయోమయంలో దలాల్ స్ట్రీట్

అమెరికా షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ 2017 నుండి దాదాపు 16 కంపెనీలలో తప్పులను ఎత్తిచూపుతూ నివేదికలు విడుదల చేసింది. తాజాగా ఈ సంస్థ అదానీ గ్రూప్ పై పరిశోధనలు జరిపి పలు ఆరోపణలతో నివేదికను విడుదల చేసింది. దీంతో అదానీ గ్రూప్ షేర్లు స్టాక్ మార్కెట్ లో భారీ పతనాన్ని చవిచూశాయి. ఈ గ్రూప్ షేర్లు ఇంకా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. పది రోజుల్లోనే అదానీ ఆదాయం 118 బిలియన్ డాలర్లు నష్టపోవాల్సి వచ్చింది. తాజాగా అదానీ గ్రూప్స్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. గ్రూప్ షేర్లు పతనం ఇంకా కొనసాగుతున్న క్రమంలో అదానీ ఎంటర్ ఫ్రైజెస్‌ను సస్టైనబిలిటీ సూచీ నుంచి తొలగిస్తున్నట్లు అమెరికాకు చెందిన ఎస్‌అండ్‌పీ డోజోన్స్‌ వెల్లడించింది.