Adani Group : అదానీ కష్టాలు.. కొనసాగుతున్న షేర్ల పతనం, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలోనూ ఎదురు గాలి

హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటికే స్టాక్ మార్కెట్లలో నష్టాలను చూస్తున్న అదానీ కంపెనీ.. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఇబ్బందులు ఎదుర్కోంటోంది.

Adani Group : అదానీ కష్టాలు.. కొనసాగుతున్న షేర్ల పతనం, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలోనూ ఎదురు గాలి

Adani Group : హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటికే స్టాక్ మార్కెట్లలో నష్టాలను చూస్తున్న అదానీ కంపెనీ.. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఇబ్బందులు ఎదుర్కోంటోంది. ఇప్పటికే దేశీయంగా స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్ షేర్లు నేల చూపులు చూస్తూనే ఉన్నాయి.

హిండెన్ బర్గ్ నివేదిక వచ్చి రోజులు గడుస్తున్నప్పటికి.. అదానీ గ్రూప్ షేర్ల పతనం మాత్రం ఆగడం లేదు. అదానీ గ్రూప్ లో ఏకంగా 6 కంపెనీల షేర్లు లోయర్ సర్క్యూట్ ను తాకాయి. గ్రూప్ ఫ్లాగ్ షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్ ప్రైజెస్ ఓ దశలో 52వారాల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు కోలుకుని ఒక శాతం లాభంతో ముగిసింది.(Adani Group)

Also Read..SBI..Adani : అదానీ గ్రూప్ సంస్థలకు SBI ఇచ్చిన రుణాలు ఎన్నివేల కోట్లో తెలుసా..?!

మరోవైపు అదానీ వ్యవహారంపై.. పార్లమెంటు ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. హిండెన్ బర్గ్ రిపోర్టు మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. అదానీ గ్రూప్ లపై విచారణకు డిమాండ్ చేస్తూ పార్లమెంటు లోపల విపక్ష పార్టీల నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బడ్జెట్ సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో పార్లమెంటులో నెలకొన్న ఈ గందరగోళం వల్ల ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి.

మరోవైపు అదానీ, హిండెన్ బర్గ్ నివేదిక వ్యవహారంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారి స్పందించారు. అదానీ గ్రూప్ లో ఎస్బీఐ, ఎల్ఐసీ వాటాలు అనుమతించదగిన పరిమితుల్లోనే ఉన్నాయని, భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ సక్రమంగా నడుస్తోందని నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పారు. బ్యాంకింగ్ వ్యవస్థ ఆరోగ్యంగా ఉందన్నారు. గణనీయంగా మెరుగుపడుతోందన్నారు. స్టాక్ మార్కెట్లకు ఎలాంటి డోకా లేన్నట్లు ఆమె భరోసా ఇచ్చారు.

Also Read..Adani Companies RBI : అదానీ సంస్థలకు ఇచ్చిన రుణాల వివరాలివ్వాలని.. వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు

అటు అమెరికా స్టాక్ మార్కెట్ లోనూ అదానీ గ్రూప్ నకు ఎదురు గాలి ప్రారంభమైంది. డోజోన్స్ సస్టెయినబిలిటీ సూచీ నుంచి అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్లను తొలగించారు. ఈ నెల 7వ తేదీ నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. హిండెన్ బర్గ్ ఆరోపణల తర్వాత మీడియా, వాటాదారుల విశ్లేషణల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డోజోన్స్ తెలిపింది. తాజా పరిణామాలతో అదానీ గ్రూప్ కంపెనీలకు నిధుల సమీకరణ కష్టం అవుతుందని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ అంటోంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

హిండెన్ బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ కంపెనీలపై ఇన్వెస్టర్ల విశ్వాసం పూర్తిగా సన్నగిల్లిన విషయాన్ని గుర్తు చేసింది. అదానీ గ్రూప్ కంపెనీల రుణ పత్రాల పరపతి, రేటింగ్ కు ఇప్పటికిప్పుడే ఎలాంటి ముప్పు లేదంటూ అంతర్జాతీయ పరపతి రేటింగ్ సంస్థ ఫిచ్(Fitch) తెలిపింది. వచ్చే ఏడాది జూన్ వరకు అయితే అదానీ గ్రూప్ కంపెనీలు.. చెల్లించాల్సిన అంతర్జాతీయ బాండ్స్ కూడా లేవని చెబుతోంది.

అమెరికా కేంద్రంగా ప‌ని చేస్తున్న షార్ట్‌ షెల్లింగ్ సంస్థ హిండెన్‌బ‌ర్గ్ రీసెర్చ్ బ‌య‌ట‌పెట్టిన నివేదిక‌తో అదానీ గ్రూప్ సంస్థ‌ల షేర్లు భారీగా ప‌త‌నం అవుతున్నాయి.

హిండన్ బర్గ్ నివేదిక అదానీ వ్యాపార సామ్రాజ్యంపై పెను ప్రభావమే చూపింది. అదానీ గ్రూప్ లోని సంస్థలపై రుణభారం లక్షల కోట్లలో ఉందని, ఆ భారీ రుణాలు తీర్చే మార్గాలను వెదకడంలో అదానీ గ్రూప్ సంస్థలు విఫలమవుతున్నాయని హిండన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక ఎత్తిచూపింది. అంతే, ఒక్కసారిగా గౌతమ్ అదానీ సంపద భారీగా పతనమైంది. 3 రోజుల వ్యవధిలో రూ.5 లక్షల కోట్లను కోల్పోయారు.