MLA Raghunandan Rao : రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక స్థానాల్లో ఏపీ క్యాడర్.. తెలంగాణ వారికి అన్యాయం : ఎమ్మెల్యే రఘునందన్ రావు

తెలంగాణ ఐఏఎస్ లకు అన్యాయం జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఎన్నికల కోసమే ఐఏఎస్, ఐపీఎస్ లను బదిలీ చేశారని ఆరోపించారు. తెలంగాణ పోలీస్ శాఖలో కీలక స్థానాల్లో ఏపీ క్యాడర్ వారిని నియమించారనిపేర్కొన్నారు.

MLA Raghunandan Rao : రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక స్థానాల్లో ఏపీ క్యాడర్.. తెలంగాణ వారికి అన్యాయం : ఎమ్మెల్యే రఘునందన్ రావు

MLA Raghunandan Rao :  తెలంగాణ ఐఏఎస్ లకు అన్యాయం జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఎన్నికల కోసమే ఐఏఎస్, ఐపీఎస్ లను బదిలీ చేశారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ బీహార్ అధికారులకు కీలక పోస్టులు ఇచ్చారని తెలిపారు. బీహార్ వ్యక్తినే డీజీపీగా నియమించారని చెప్పారు. తెలంగాణ పోలీస్ శాఖలో కీలక స్థానాల్లో ఏపీ క్యాడర్ వారిని నియమించారని ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు.

డీజీపీ అంజనీ కుమార్, అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ సంజయ్ కుమార్ జైన్, ఐజీ హైదరాబాద్ షానవాజ్ ఖాసీం, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అడిషనల్ డీజీ కేడర్ లో స్వాతి లక్రాను నియమించారని తెలిపారు. వీరంతా బీహార్ కు చెందినవారేనని స్పష్టం చేశారు. సైబర్ సెక్యూరిటీ ఐజీగా స్టీఫెన్ రవీంద్రను నియమించారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసిన స్టీఫెన్ రవీంద్రది ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు.

Raghunadan Rao: రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేసీఆర్ పిచ్చి ప్రేలాపనలు: రఘునందన్ రావు

తెలంగాణ వారికి కీలకమైన పోస్టులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2001 తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్, కవిత లేరని స్పష్టం చేశారు. తాము జై తెలంగాణ అన్న రోజు కేటీఆర్ తెలంగాణ ఉద్యమం లేరని.. లక్ష రూపాయల జీతం తీసుకున్నారని గుర్తుచేశారు. తాము జై తెలంగాణ అని నినాదాలు చేస్తుంటే నీవు అమెరికాలో మమ్మల్ని చూసి నవ్వినవాడివని కేటీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యాలు చేశారు.

నీవంటి వాడిని కూడా ఇండియాకు రప్పించి తెలంగాణ కోసం తాను కొట్లాడినట్లు తెలిపారు. నా మూలాల గురించి ప్రశ్నించేటప్పుడు నీ మూలాలు ఎటువైపు పోతున్నాయనో ఆలోచన చేయాలన్నారు. నాటి కానిస్టేబుల్ కిష్టయ్యను ఆదర్శంగా తీసుకోవాలని పోలీసులకు సూచించారు.