JNU Campus: కమ్యూనిస్టులు ఇండియాను వదిలేయాలి.. జేఎన్‭యూలో బ్రాహ్మణ వ్యతిరేక రాతలపై హిందూ రక్షాదళ్ ప్రతిరాతలు

గురువారం జేఎన్‭యూలోని గోడలపై “బ్రాహ్మణులు క్యాంపస్‌ను విడిచిపెట్టండి”, “మా రక్తం ఉంటుంది”, “బ్రాహ్మణులు భారత్‭ను వదిలి పెట్టండి”, “బ్రాహ్మిన్-బనియాలానా, మేము మీ కోసం వస్తున్నాము! మీమీద ప్రతీకారం తీర్చుకుంటాము” అనే నినాదాలు కనిపించాయి. అలాగే స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ II భవనంలోని గోడలను ధ్వంసం చేశారని యూనివర్సిటీ యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది.

JNU Campus: కమ్యూనిస్టులు ఇండియాను వదిలేయాలి.. జేఎన్‭యూలో బ్రాహ్మణ వ్యతిరేక రాతలపై హిందూ రక్షాదళ్ ప్రతిరాతలు

'Communist quit India': JNU campus walls defaced with slogans by Hindu Raksha Dal

JNU Campus: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని క్యాంపస్ గోడలపై బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు కనిపించడాన్ని వ్యతిరేకిస్తూ.. హిందూ రక్షాదళ్ అనే సంస్థ అదే గోడలపై కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేసింది. కమ్యూనిస్టులు భారతదేశాన్ని వదిలయాలని డిమాండ్ చేస్తున్నట్లు గోడలపై రాశారు. ‘కమ్యూనిస్టులు=ఐసీస్’, ‘జిహాదీలు దేశాన్ని వీడాలి’ అంటూ గోడలపై నినాదాలు చేశారు. చివరలో ఈ రాతలు రాసింది ‘హిందూ రక్షా దళ్’ అని పేర్కొన్నారు.

గురువారం జేఎన్‭యూలోని గోడలపై “బ్రాహ్మణులు క్యాంపస్‌ను విడిచిపెట్టండి”, “మా రక్తం ఉంటుంది”, “బ్రాహ్మణులు భారత్‭ను వదిలి పెట్టండి”, “బ్రాహ్మిన్-బనియాలానా, మేము మీ కోసం వస్తున్నాము! మీమీద ప్రతీకారం తీర్చుకుంటాము” అనే నినాదాలు కనిపించాయి. అలాగే స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ II భవనంలోని గోడలను ధ్వంసం చేశారని యూనివర్సిటీ యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. దీనిపై యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ గురువారం నివేదిక కోరారు. ఫిర్యాదుల కమిటీ విచారణ చేపట్టి తనకు తుది నివేదిక సమర్పించాలని ఆదేశించారు. గోడలపై రాసిన నినాదాలను కొంత మంది ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారని, ఆ వివరాలను సైతం సేకరించాలని వీసీ ఆదేశించారు.

ఇక తాజా ఘటనపై సైతం చర్యలు తీసుకుంటామని యూనివర్సిటీ యాజమాన్యం పేర్కొంది. ఈ పరిణామాలను సీరియస్‌గా తీసుకున్న జేఎన్‌యూ వైస్‌ ఛాన్సలర్ శాంతిశ్రీ పాండి.. ఇలాంటి ధోరణులను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. జేఎన్‌యూ అందరికీ చెందినది కాబట్టి ఇలాంటి ఘటనలను సహించబోమని ఆయన స్పష్టం చేశారు.

Rajastan: గ్యాంగ్‭స్టర్ రాజు థెట్ దారుణ హత్య.. తామే చేశామని ఒప్పుకున్న లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్