రైతులు, కార్మికుల ఎదుట ఏ శక్తి నిలవదు, చట్టాలను వెనక్కి తీసుకోవాలి – రాహుల్

రైతులు, కార్మికుల ఎదుట ఏ శక్తి నిలవదు, చట్టాలను వెనక్కి తీసుకోవాలి – రాహుల్

Congress delegation meets President : రైతులు, కార్మికుల ఎదుట ఏ శక్తి నిలవదని, కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు, రైతులు చేస్తున్న ఆందోళనపై ఆయన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. పార్టీ సీనియర్ నేతలు గులాం నబీఆజాద్, అధీర్ రంజన్ చౌధురీలు కూడా ఆయనతో పాటు ఉన్నారు. దేశవ్యాప్తంగా సేకరించిన రెండు కోట్ల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని అందచేశారు. సాగు చట్టాలపై రైతలు చేస్తున్న ఆందోళనను రాష్ట్రపతికి వివరించారు. ఈ సందర్భంగా మీడియాతో రాహుల్ మాట్లాడారు.

అక్కడి నుంచి రైతులు ఎట్లాంటి పరిస్థితుల్లో వెనక్కు వెళ్లరని, చట్టాలను వెనక్కి తీసుకొనేంత వరకు వారు ఉద్యమిస్తారని చెప్పారు. పార్లమెంట్ సమావేశాలను వెంటనే సమావేశపర్చాలని డిమాండ్ చేశారాయన. తామందరం (విపక్షాలు) కోసం నిలబడ్డామని, చర్చ జరగకుండానే…మూడు చట్టాలను ఆమోదించారని విమర్శించారు. ముగ్గురు వ్యక్తులు మాత్రమే రాష్ట్రపతిని కలిశామని, కానీ…కోట్లాను మంది సంతకాలు, రైతుల గళాన్ని వినిపించామన్నారు. ప్రస్తుత చలికాలంలో రైతులు చేస్తున్న ఆందోళన దేశం చూస్తోందని, ప్రధాన మంత్రి వినిపించుకోవాల్సిందేనన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడితే…వారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని, మోదీ తీసుకున్న నిర్ణయాలతో కోట్ల మంది జీవితాలు రోడ్డున పడుతున్నాయన్నారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకోకపోతే..దేశం ఇబ్బందుల్లో పడుతుందని హెచ్చరించారు.

అంతకంటే ముందు…వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ నేతలు విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి కార్యాలయానికి నిరసన ప్రదర్శన నిర్వహించాలని భావించారు. అయితే కాంగ్రెస్ నేతలందరూ రాష్ట్రపతి కార్యాలయం వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఉన్న ముగ్గురికి మాత్రమే అనుమతి ఇచ్చారు. అనుమతి లేకపోయినా ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను కాంగ్రెస్ కార్యాలయం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. ప్రియాంక గాంధీ సహా పలువురిని అరెస్టు చేశారు. అటు పార్లమెంట్, రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు.