కండిషన్స్ అప్లై : నాన్నకు ఏడాది సెలవులు

బిడ్డ పుడితే అమ్మకే కాదు నాన్నలకు కూడా ఏడాది సెలవులను ఇచ్చేందుకే కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కండిషన్స్ అప్లై : నాన్నకు ఏడాది సెలవులు

Father

బిడ్డ పుడితే అమ్మకే కాదు నాన్నలకు కూడా ఏడాది సెలవులను ఇచ్చేందుకే కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

న్యూఢిల్లీ: బిడ్డ పుడితే అమ్మకే కాదు నాన్నలకు కూడా ఏడాది సెలవులను ఇచ్చేందుకే కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏవైనా కారణాల వల్ల పుట్టిన బిడ్డను చూసేందుకు తల్లి గానీ లేక సంరక్షకులు గానీ  లేనిపక్షంలో.. చిన్నారిని చూసుకునేందుకు.. సంరక్షణ కోసం తండ్రి మాత్రమే ఉన్న పరిస్థితుల్లో అటువంటి పురుషుడికి ఏడాదిపాటు వేతనంతో కూడిన సెలవులను అమలు చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  సాధారణంగా ఆడవారికి డెలీవరీ సమయంలో మెటర్నిటీ లీవ్ రూపంలో ఈ సౌకర్యం ఉంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల  తల్లిని కోల్పోయినా.. లేదా ఎటువంటి పరిస్థితుల్లోనైనా తల్లి గానీ.. లేదా ఇతర సంరక్షకులు గానీ లేకుంటే పుట్టిన చిన్నారులను పెంచేందుకు తండ్రులు ఇబ్బందులు పడుతున్నారన్న అంశంపై దృష్టి సారించిన కేంద్రప్రభుత్వం.. బిడ్డ ఆలనాపాలనా చూసుకునే తండ్రికి  బిడ్డ పుట్టిన మొదటి సంవత్సరం పాటు అంటే 365 రోజులు 100 శాతం  సేలరీతో కూడిన సెలవు మంజూరు చేయనుంది. తరువాత కూడా అవసరాన్ని బట్టి ఆ తండ్రి  సెలవులు పొడిగించుకోవాల్సిన అవసరముంటే 730 రోజులకూ అంటే మరో సంవత్సరం పాటు సగం సేలరీతో కూడిన సెలవులను పొందే అవకాశాన్ని నరేంద్రమోదీ ప్రభుత్వం కల్పించింది.

కాగా, నిర్ణయం తల్లిలేని పిల్లలకు..వారిని సంరక్షించే తండ్రులకు ఇదొక వరంలాంటిదని చెప్పవచ్చు. 7వ వేతన సంఘం చేసిన సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. దానికి సంబంధించిన నోటికేషన్ జారీ చేసింది. మరి తండ్రూలూ..మీ పాపాయి కోసం మీరిక బాధపడాల్సిన అవసరం లేదు.. కొత్తగా ప్రపంచంలోకి అడుగు పెట్టిన బిడ్డతో గడిపేందుకు తండ్రికి  వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఫేస్‌బుక్‌ 2016 జనవరి నుండి అమలు చేస్తోంది. ఫేస్ బుక్ హెచ్ఆర్ డిపార్ట్ మెంట్ చీఫ్ లోరీ మాట్లోఫ్ పేరెంటల్ లీవ్ పాలసీలను సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నారు జుకర్ బర్గ్. ఫేస్‌బుక్‌‌లో ఫుల్ టైమ్ వర్కర్లు కొత్తగా తండ్రులైతే నాలుగు నెలల వేతనంతో కూడిన సెలవును పొందేలా అమలు చేస్తున్నారు. కాగా తమ సిబ్బందికి, వారి కుటుంబాలకు తాము చేయగలిగే సరైన సహాయం ఇదేనని జుకర్ బర్గ్ తెలిపారు. కాగా స్వలింగ దంపతులకు, బిడ్డను దత్తత తీసుకున్నపుడు కూడా ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం అమెరికాలో ఫేస్‌బుక్‌లో పనిచేసే తల్లులకు, తండ్రులకు ఈ విధానం అమలవుతోంది. బిడ్డ పుట్టిన తర్వాత ఖర్చుల కోసం ఫేస్‌బుక్‌ తన ఉద్యోగులకు 4 వేల డాలర్లు ఇస్తోంది.