‘జర్నలిజం విలువలు తగ్గిపోతున్నాయి’

‘జర్నలిజం విలువలు తగ్గిపోతున్నాయి’

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు జర్నలిజం విలువలు తగ్గిపోతున్నాయంటూ విమర్శలకు దిగారు. ప్రస్తుత కాలంలో టీవీ చానెళ్లు, న్యూస్ పేపర్లు కొన్ని వ్యాపార గ్రూపులు, రాజకీయ పార్టీల కారణంగా విలువు కోల్పోతున్నాయి. సెన్సేషనలిజానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎక్కువమంది చూసేదానినే చూపిస్తున్నారు. 

సెన్సేషనలిజం అంటే సెన్స్ లేకపోవడం అనేది తెలుసుకోలేకపోతున్నారు. వ్యాపార గ్రూపులు, రాజకీయ పార్టీలు, వ్యక్తిగత టీవీ చానెళ్లు, న్యూస్ పేపర్లు వారి ఇష్టం మేర జర్నలిజం నడిపిస్తూ విలువలు పోగొట్టుకుంటున్నారు. అంటే రాజకీయ పార్టీలు న్యూస్ పేపర్ నడపకూడదా అంటే నడిపించొచ్చు. కానీ, ఇది పలానా రాజకీయ పార్టీకి చెందినది అని ముందుగానే చెప్పాలి’ అని నాయుడు స్పష్టం చేశారు. 

‘గతంలో వార్తని వార్తలాగే చెప్పేవారు. ఎప్పుడూ దానిని తప్పుదోవ పట్టించేవారు కాదు. కానీ, ఈ రోజుల్లో పాఠకులను బట్టి వార్తలు మారుతున్నాయి. అదే అసలు సమస్య’ అని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మీడియా సమావేశంలో వెల్లడించారు.