Drones Delivery Covid-19 Vaccine : ఇండియాలో డ్రోన్ల ద్వారా కోవిడ్ వ్యాక్సిన్ డెలివరీ

ఇండియాను కరోనావైరస్ మహమ్మారి వణికిస్తోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరణాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి.

Drones Delivery Covid-19 Vaccine : ఇండియాలో డ్రోన్ల ద్వారా కోవిడ్ వ్యాక్సిన్ డెలివరీ

Drones Delivery Covid 19 Vaccine

Drones Delivery Covid-19 Vaccine : ఇండియాను కరోనావైరస్ మహమ్మారి వణికిస్తోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరణాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. కరోనాను కట్టడిచేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ల కొరత కొన్ని చోట్ల ఆందోళనకు గురిచేస్తోంది. సకాలంలో వ్యాక్సిన్లను అందించడం కష్టంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో కరోనా వ్యాక్సిన్లను డ్రోన్ల ద్వారా డెలివరీ చేయనున్నారు.



భారతీయ వైద్య పరిశోధన మండలి (ICMR) భాగస్వామ్యంతో భారతీయ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) డ్రోన్ల ద్వారా కరోనా వ్యాక్సిన్లను డెలివరీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. బెంగళూరు ఆధారిత సీడీ స్పేస్ రోబటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, భారత్ బయోటెక్ సంయుకత్తంగా ఈ కోవిడ్ వ్యాక్సిన్ డెలివరీ డ్రోన్ వ్యవస్థను డెవలప్ చేశాయి. అతిత్వరలో డ్రోన్ల ద్వారా కరోనా వ్యాక్సిన్లను డెలివరీ చేయనున్నారు.

దేశవ్యాప్తంగా మే 1 నుంచి 18ఏళ్లు దాటిన అందరికి కరోనా వ్యాక్సిన్ అందించాలంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఈ ప్రకటన వెలుగులోకి వచ్చింది. దేశంలో మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయనుంది. డ్రోన్ల ద్వారా కోవిడ్ వ్యాక్సిన్ల డెలివరీపై అధ్యయనానికి ఆమోదం తెలిపినట్టు మినిస్టరీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (MoCA), డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఒక ప్రకటనలో వెల్లడించింది.



అన్ నేమడ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ (UAS) రూల్స్ 2021 నుంచి అధ్యయనానికి షరతులతో కూడిన మినహాయింపును ఐసీఎంఆర్, ఐఐటీ ఇచ్చినట్టు MoCA పేర్కొంది. ఈ మినహాయింపు ఏడాదిపాటు కొనసాగనుంది. డ్రోన్ల ద్వారా కరోనా వ్యాక్సిన్ రిమోట్ ఏరియాల్లో వేగంగా డెలివరీ చేయడమే కాకుండా సమయం కూడా ఆదా అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో డ్రోన్ల ద్వారా డెలివరీ ప్రక్రియను పూర్తిస్థాయిలో అమల్లోకి తేవడానికి కొంతసమయం పట్టే అవకాశం ఉంది.