ఢిల్లీ ఎన్నికలు : కాంగ్రెస్ కార్యకర్తను కొట్టబోయిన ఆల్కా లంబా

  • Published By: madhu ,Published On : February 8, 2020 / 08:52 AM IST
ఢిల్లీ ఎన్నికలు : కాంగ్రెస్ కార్యకర్తను కొట్టబోయిన ఆల్కా లంబా

దేశ రాజధానిలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఫిబ్రవరి 08వ తేదీ ఉదయం 08గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. అయితే..నార్త్ ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద..కాంగ్రెస్, ఆప్ కార్యకర్తలకు ఘర్షణ జరగడం కొంత కలకలం రేపింది. స్వల్ప వివాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఆల్కా లంబా..ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తను కొట్టబోయిన వీడియో వైరల్ అవుతోంది.
 

వీరి మధ్యలో ఏం జరిగిందో మాత్రం తెలియడం లేదు. అల్కా లంబా నుంచి ఆ వ్యక్తి తప్పించుకొనే ప్రయత్నం చేశాడు. అక్కడనే ఉన్న పోలీసులు వీరిని వారించే ప్రయత్నం చేశారు. 
పోలింగ్ కేంద్రానికి వెళితే..ఆప్ కార్యకర్త అసభ్యపదజాలంతో దూషించారరని అల్కా లంబా వెల్లడించారు. తాను కొట్టబోయే సరికి పోలీసులు అతడిని చుట్టుముట్టారని, ఓడిపోతామనే భయంతో ఆప్ కార్యకర్తలున్నారని వివరించారు. తన చాందినీ చౌక్ నియోజకవర్గంలో తప్పకుండా కాంగ్రెస్ గెలుస్తుందనే దీమాలో అల్కా లంబా ఉన్నారు. ఆప్ కార్యకర్తపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆల్కా లంబా వెల్లడించారు. 

* ఆల్కా లంబా తొలుత ఆప్ పార్టీలో పనిచేశారు. ఢిల్లీలోని చాందీని నియోజకవర్గం ఎమ్మెల్యే ఆల్కా లంబా..సెప్టెంబర్ 06వ తేదీన ఆప్‌కి రాజీనామా చేశారు. 
* పార్టీ పేదల పార్టీ కాదు..బంధు ప్రీతి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారామె. 
* ఢిల్లీ లోక్ సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి బాధ్యత తీసుకోవాలని పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఆల్కా లంబా బాహాటంగా కోరగా పార్టీలో ఆమెకు వ్యతిరేకంగా గళం విప్పారు కొందరు నాయకులు.

* ఈ క్రమంలో  పార్టీ ఎమ్మెల్యేల అధికారిక వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి కూడా ఆమెను తొలగించారు.
* అదేవిధంగా కేజ్రీవాల్‌ ట్విటర్‌లో తనను అన్‌ఫాలో చేయడం వంటి పరిణామాలు జరగడంతో పొమ్మనలేక పొగపెట్టారంటూ అల్క లంబా ఆరోపణలు చేసింది.
* దీంతో ఆప్‌ తీరును విమర్శిస్తూ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి పార్టీలో కొనసాగలేనంటూ పార్టీకి రాజీనామా చేసింది.