Delhi Metro Bikini Girl : మెట్రోలో బికినీలో యువతి.. తీవ్ర విమర్శలకు ఘాటుగా రిప్లయ్, డోంట్ కేర్ అంటూ ఎదురుదాడి

Delhi Metro Bikini Girl : ఎలాంటి బట్టలు వేసుకోవాలన్నది పూర్తిగా నా ఇష్టం. విమర్శలను అస్సలు పట్టించుకోను. ఎవరేం అనుకున్నా నాకు అనవసరం.

Delhi Metro Bikini Girl : మెట్రోలో బికినీలో యువతి.. తీవ్ర విమర్శలకు ఘాటుగా రిప్లయ్, డోంట్ కేర్ అంటూ ఎదురుదాడి

Delhi Metro Bikini Girl (Photo : Google)

Delhi Metro Bikini Girl : ఇటీవల ఢిల్లీ మెట్రోలో ఓ యువతి బికినీలో కనిపించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ అమ్మాయి డ్రెస్ స్టైల్ తోటి ప్రయాణికులతో పాటు అందరినీ షాక్ కి గురి చేసింది. బికినీ లాంటి డ్రెస్ లో, అర్థనగ్నంగా యువతి మెట్రోలో ప్రయాణించడం దుమారం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఆ యువతి వస్త్రధారణపై తీవ్ర విమర్శలు వచ్చాయి. బ్రా, మినీ స్కర్ట్ వేసుకుని.. పబ్లిక్ ప్లేస్ లో మరీ ఇంత బోల్డ్ గా కనిపించడంపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఇలాంటి డ్రెస్ వేసుకుని సభ్య సమాజానికి ఏం మేసేజ్ ఇద్దామని నెటిజన్లు మండిపడ్డారు. ఇలాంటి దుస్తుల్లో బహిరంగ ప్రదేశాల్లో తిరగడం కరెక్ట్ కాదన్నారు. ఆ అమ్మాయి.. ఇది ప్యారిస్ అనుకుంటుందేమో అని కొందరు తిట్టిపోశారు. పబ్లిస్ ప్లేస్ లో తన చేష్టలతో న్యూసెన్స్ క్రియేట్ చేసిందని, ఆ అమ్మాయిపై చర్యలు తీసుకోవాలని కొందరు నెటిజన్లు ఢిల్లీ మెట్రో అధికారులను డిమాండ్ కూడా చేశారు.

Also Read..Viral Video : ద్యావుడా..! మెట్రో ట్రైన్‌లో బికినీలో యువతి, వీడియో వైరల్

తన డ్రెస్ స్టైల్ పై వస్తున్న విమర్శలపై ఆ యువతి ఎట్టకేలకు స్పందించింది. నెటిజన్లు వేస్తున్న ప్రశ్నలకు కాస్త ఘాటుగానే బదులిచ్చింది. పబ్లిసిటీ కోసమే ఇలా చేశానని కొందరు అంటున్నారు. కానీ అందులో నిజం లేదు. పబ్లిసిటీ కోసం నేనలా చేయలేదని వివరించింది. అంతేకాదు ప్రజలు ఏం అనుకుంటున్నారో నాకు అవసరం లేదని తేల్చి చెప్పింది.

వాళ్ల విమర్శలను అస్సలు పట్టించుకోను, డోంట్ కేర్ అన్నట్లుగా మాట్లాడింది. ఎలాంటి బట్టలు వేసుకోవాలన్నది పూర్తిగా నా ఇష్టం అని స్పష్టం చేసింది. ఇక, ఉర్ఫీ జావెద్ ను నేను ఫాలో అవుతున్నట్టు కొందరు విమర్శిస్తున్నారు. అందులో నిజం లేదు. నేను ఎవరినీ ఫాలో అవడం లేదు. అసలు ఉర్ఫీ జావెద్ ఎవరో కూడా నాకు తెలియదని ఆ యువతి వివరణ ఇచ్చింది.

”ఇలాంటి డ్రెస్ లో మెట్రోలో ప్రయాణించడం కొత్తేమీ కాదు.. కొన్ని నెలలుగా ఇలానే ప్రయాణం చేస్తున్నా. నా గురించి పట్టించుకునే వారిని నేను అస్సలు కేర్ చెయ్యను. నేను ఏమి ధరించాలనుకుంటున్నానో అది నా స్వేచ్ఛ. నేను పబ్లిసిటీ స్టంట్ కోసమో లేదా పాపులర్ అవడం కోసమో ఇది చేయడం లేదు. ప్రజలు ఏమి మాట్లాడుతున్నారో నేను పట్టించుకోను. ఉర్ఫీ జావేద్‌ నుంచి నేను స్ఫూర్తి పొందలేదు. ఇటీవలి వరకు ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. ఒక స్నేహితుడు ఆమె ఫోటోను నాకు చూపించాడు. ఆమె గురించి తెలిసిన తర్వాతే ఆమెను చూశాను” అని ఆ బికినీ యువతి చెప్పుకొచ్చింది.

Also Read..Delhi : వెరైటీ కోసం పాకులాడి గన్‌తో కేక్ కట్ చేశాడు.. ఆ తరువాత పోలీసులకి చిక్కి…

బికినీలో యువతి ప్రయాణంపై తీవ్ర విమర్శలు రావడంతో.. ఢిల్లీ మెట్రో అధికారులు స్పందించారు. ”సమాజంలో ఆమోదయోగ్యమైన సామాజిక మర్యాద, ప్రోటోకాల్‌” అనుసరించాలని ప్రయాణికులను కోరుతున్నాం అంటూ.. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ఒక ప్రకటన విడుదల చేసింది.