జూన్-9వరకు ఢిల్లీలోని స్కూల్స్ కి వేసవి సెలవులు

సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న వేళ ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

జూన్-9వరకు ఢిల్లీలోని స్కూల్స్ కి వేసవి సెలవులు

Delhi Schools To Be On Summer Vacation From Tomorrow To June 9 Amid Covid Spike

Delhi schools సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న వేళ ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందుకు మే-11నుంచి జూన్-3వరకు వేసవి సెలవులను నిర్ణయించగా..కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్-20 నుంచి జూన్-9వరకు ఢిల్లీలోని స్కూల్స్ అన్నింటీకి వేసవి సెలవులను ప్రకటిస్తూ కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం(ఏప్రిల్-19,2021)డైరక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓ సర్క్యులర్ జారీ చేసింది.

ఇక, ఢిల్లీలో నైట్ కర్ఫ్యూని ఏప్రిల్-26వరకు పొడిగించింది ప్రభుత్వం. రాత్రి 10గంటల నుంచి ఉదయం 5గంటల వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగనుంది.