Chhattisgarh : లాక్ డౌన్ పేరిట దురుసుగా ప్రవర్తించిన కలెక్టర్‌పై వేటు

సూరజ్ పూర్ కలెక్టర్ రణ్‌బీర్ శర్మపై వేటు పడింది. ఈయన్న సస్పెండ్ చేస్తున్నట్లు ఛత్తీస్ గడ్ సీఎం ప్రకటించారు.

Chhattisgarh : లాక్ డౌన్ పేరిట దురుసుగా ప్రవర్తించిన కలెక్టర్‌పై వేటు

District Collector

Ranbir Sharma Has Been Suspended : సూరజ్ పూర్ కలెక్టర్ రణ్‌బీర్ శర్మపై వేటు పడింది. ఈయన్న సస్పెండ్ చేస్తున్నట్లు ఛత్తీస్ గడ్ సీఎం ప్రకటించారు. మందులు కొనడానికి వెళుతున్న వ్యక్తిపై కలెక్టర్ రణ్ బీర్ శర్మ చేయి చేసుకున్నారు. ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సూరజ్ పూర్ కలెక్టర్ గా గౌరవ్ కుమార్ సింగ్ ను నియమించారు.

కరోనా కట్టడిలో భాగంగా..పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. కొన్ని రాష్ట్రాలు సంపూర్ణంగా లాక్ డౌన్ విధించగా..మరికొన్ని రాష్ట్రాలు కొన్ని గంటల వెసులుబాటు కల్పించింది. ఛత్తీస్ గడ్ లో కూడా లాక్ డౌన్ కొనసాగుతోంది. సూరజ్ పూర్ జిల్లా కలెక్టర్ రణబీర్ శర్మ లాక్ డౌన్ అమలు తీరును పర్యవేక్షిస్తున్నారు. ఓ ప్రాంతంలో అమాన్ మిట్టల్ రోడ్డుపై వెళుతున్నాడు. ఇతడిని కలెక్టర్ పిలిచాడు.

అనంతరం కారు దగ్గరకు వెళుతున్న కలెక్టర్ మరలా ఆ యువకుడిని పిలిచారు. రోడ్డు మీదకు ఎందుకు రావాల్సి వచ్చిందో చెప్పడానికి ఏదో పేపర్ చూపించాడు. అంతే..ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన కలెక్టర్ యువకుడి చేతిలో ఉన్న సెల్ ఫోన్ నేలకేసి కొట్టాడు. అక్కడితో ఆగకుండా..ఆ యువకుడి చెంప చెళ్లుమనిపించాడు. అనంతరం కొట్టండి అంటూ ఆదేశాలు ఇవ్వడం..పోలీసులు లాఠీలతో కొట్టారు.

ఆ యువకుడు మందులు కొనడానికి వెళుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. కలెక్టర్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.