కరోనా దెబ్బతో….వాడుకలోకి కొత్త పదాలు

  • Published By: veegamteam ,Published On : April 5, 2020 / 05:05 AM IST
కరోనా దెబ్బతో….వాడుకలోకి కొత్త పదాలు

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ వైరస్ వల్ల ప్రజలందరూ భయాందోళనలకు గురి అవుతున్నారు. ఈ వైరస్ కారణంగా కొత్త కొత్త పదాలు వాడుకలోకి వస్తున్నాయి. కొవిడియట్, కరోనిక్ లాంటి చాలా పదాలు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి మరికొన్ని పదాల గురించి తెలుసుకుందాం..

కోవిడియంట్ : కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ప్రభుత్వ ఆదేశాలను ఖచ్చితంగా పాటించే వ్యక్తిని కోవిడియంట్ అని పిలుస్తారు.

కోవిడియట్ : సామాజిక దూరం వంటి ఆదేశాలను పాటించకుండా తోటివారి ప్రాణాలతో ఆటలు ఆడుతూ, వారి జీవితాలను ప్రమాదాల్లోకి పడేస్తున్న వారిని కోవిడియట్ గా పిలుస్తున్నారు.

ప్రెప్పర్ : ఇంటికి కావలసిన వస్తువులు, ఆర్ధిక పరిస్ధితుల విషయంలో అతి జాగ్రత్త పాటించేవారిని ప్రెప్పర్ అంటారు.

కరోనిక్ : కరోనా వైరస్ పాటిజివ్ వచ్చిన వ్యక్తి అని అర్ధం.

కరోనలింగస్ : ఈ మహమ్మారి సమయంలో సెక్స్ చేసేవారిని కరోనలింగస్ అని పిలుస్తారు.

కరోనాఫోబియా : కరోనా వైరస్ భయం, ఒత్తిడితో ఫేస్ మాస్కులను ధరించే వారిని కరోనాఫబియా అని పిలుస్తారు.

కోరోనాపోకలిప్స్ : ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ అని అర్ధం.

జూంబాంబింగ్ : చిత్రాలను జూమ్ చేసి చూడటం, చిత్రాలను ట్రోల్ చేయటాన్ని జూంబాంబింగ్ అంటారు.