Dolo 650: రికార్డ్ స్థాయిలో డోలో సేల్స్… 10నెలల్లో రూ.567కోట్లు

తలనొప్పి, ఒంటి నొప్పులు, జ్వరం ఇలా ఏదైనా సరే వెంటనే గుర్తుకొచ్చేది డోలో 650. ఇక కొవిడ్ మహమ్మారి పుణ్యమాని మార్చి 2020 నుంచి సేల్స్ లో తిరుగులేకుండా దూసుకుపోతుంది.

Dolo 650: రికార్డ్ స్థాయిలో డోలో సేల్స్… 10నెలల్లో రూ.567కోట్లు

Dolo 650

Dolo 650: తలనొప్పి, ఒంటి నొప్పులు, జ్వరం ఇలా ఏదైనా సరే వెంటనే గుర్తుకొచ్చేది డోలో 650. ఇక కొవిడ్ మహమ్మారి పుణ్యమాని మార్చి 2020 నుంచి సేల్స్ లో తిరుగులేకుండా దూసుకుపోతుంది. కొవిడ్ థర్డ్ వేవ్ వస్తే.. డోలోనే ఆధారమంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.

జనవరి 2020 నుంచి పరిశీలిస్తే.. Dolo 650 ఇప్పటివరకూ టాప్ రేంజ్ లో ఉంది. దీని కంటే ముందు వరుసలో Calpol, Sumo Lలు ఉన్నాయి. ఇండియా వ్యాప్తంగా పారాసిటమాల్ 37బ్రాండ్లు అమ్ముడవుతున్నాయి.

హెల్త్‌కేర్ విభాగంలోని హ్యూమన్ డేటా సైన్స్, అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్ లను పరిశీలిస్తే డోలో, కాల్పోల్ రెండు మాత్రమే కీలకమైన బ్రాండ్స్ గా పేరు తెచ్చుకున్నాయి. బెంగళూరులోని మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ తయారుచేసిన డోలో 650, జీఎస్కే ఫార్మాసూటికల్స్ తయారుచేసిన కాల్పోల్ మెడిసిన్ ఇండస్ట్రీలో డామినెంట్ గా దూసుకెళ్తున్నాయి.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ కు “ఫార్ములా ఈ” కార్ రేసింగ్

డిసెంబర్ 2021లో డోలో 650సేల్స్ రూ.28.9కోట్లు ఉండగా, గతేడాది డిసెంబరులో జరిపిన సేల్స్ కంటే ఇది 61.45శాతం ఎక్కువ. సెకండ్ వేవ్ వచ్చిన సమయంలో ఏప్రిల్, మే 2021లో రూ.48.9కోట్లు, రూ.44.2కోట్ల అమ్మకాలు జరిపింది.

డోలో 650 కంపెనీ వెబ్ సైట్ సమాచారాన్ని బట్టి వార్షిక ఆధాయం రూ.2వేల 700కోట్లు ఉండగా ఎగుమతుల నుంచి రూ.920కోట్లు వరకూ ఆదాయం దక్కుతుంది.