దసరా వేడుక : వెండి మాస్కులు ధరించిన అమ్మవార్లు..

  • Published By: nagamani ,Published On : October 21, 2020 / 12:45 PM IST
దసరా వేడుక : వెండి మాస్కులు ధరించిన అమ్మవార్లు..

west bengal Durga: పశ్చిమ బెంగాల్‌లోని బీభూమ్ జిల్లాలో దసరా వేడుకలు అంగరంగ వైభోగంగా జరుగుతున్నాయి. ఈ కరోనా కాలంలో దసరా పండుగ సందర్భంగా ముగ్గురమ్మల గన్న మూలపుటమ్మ దుర్గమ్మను భక్తులు భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు.


ఈ సదర్భంగా బీభూమ్ జిల్లాలోని ఓ దుర్గా పూజా మందిరంలో కొలవైన దుర్గమ్మ ‘‘మాస్క్’’ పెట్టుకుంది. ఈ కరోనా కాలంలో ప్రజలంతా మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలనే సందేశాన్నిస్తూ దుర్గా పూజా కంటీ నిర్వాహకులు ఇలా ‘‘అమ్మవారికి వెండితో తయారుచేసిన మాస్క్’’ పెట్టారు.



https://10tv.in/kolkata-puja-pandal-replaces-durga-idol-with-migrant-woman-to-pay-tribute-to-workers-mothers/
దేశంలో కోవిడ్ -19 కేసులు కొనసాగుతున్న క్రమంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇలా దేవతల దేవతల విగ్రహాలకు ‘‘వెండితో తయారు చేసిన మాస్కు‘‘లను అలంకరించాలని కమిటీ నిర్ణయించింది.


పూజామందిరంలో కొలువైన దుర్గామాతా, సరస్వతి దేవి, లక్ష్మిదేవి, లార్డ్ కార్తీకేయ విగ్రహాలకు వెండితో తయారుచేసిన మాస్కులను అలంకరించామని పూజా కమిటీ నిర్ణయించిందని జ్యోతి సుభాష్ ఘోస్తి.. కమిటీ కార్యదర్శి దేవాశిష్ సాహా తెలిపారు.


ఈ కమిటీ గత 33 సంవత్సరాలుగా దసరా వేడులను నిర్వహిస్తోందని..ఈ ఏడాది కరోనా మహమ్మారి సందర్భంగా ఇలా ప్రత్యేకంగా అలంకారాలు చేశామని దేవాశిష్ సాహా తెలిపారు.