Jharkhand CM Hemant Soren : జార్ఖండ్ సీఎం నివాసంపై ఈడీ దాడులు

జార్ఖండ్​ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) దాడులు నిర్వహిస్తోంది. టెండర్‌ స్కామ్‌ వ్యవహారంలో సీఎం హేమంత్‌ సహా ఆయన సన్నిహితుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Jharkhand CM Hemant Soren :  జార్ఖండ్ సీఎం నివాసంపై ఈడీ దాడులు

Ed Conducts Raids Against Jharkhand Cm Hemant Soren

ED conducts raids against Jharkhand CM Hemant Soren : జార్ఖండ్​ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) దాడులు నిర్వహిస్తోంది. టెండర్‌ స్కామ్‌ వ్యవహారంలో సీఎం హేమంత్‌ సహా ఆయన సన్నిహితుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సాహెబ్​గంజ్​, మీర్జా చౌకీ, బర్హార్వా‌​, రాజ్‌మహల్ సహా మొత్తం 18 ప్రాంతాల్లో శుక్రవారం (జులై 8,2022)తెల్లవారుజాము నుంచే సోదాలు చేస్తున్నారు.
సీఎం సోరెన్ నివాసంతో పాటు ఆయన ప్రతినిధి పంకజ్​ మిశ్రా నివాసంలో కూడా పారా మిలటరీ బలదాల సహాయంతో ఈడీ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది.

 

కాగా గత మే నెలలో జార్ఖండ్ మైనింగ్ సెక్రటరీ పూజా సింఘాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు రాంచీలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జార్ఖండ్‌లో జాతీయ ఉపాధి హామీ ప‌ధ‌కం(MGNREGA) నిధుల దుర్వినియోగం, ఇతర ఆరోపణలకు సంబంధించిన మనీలాండరింగ్ విచారణకు సంబంధించి సింఘాల్ ను విచారణ చేసింది విచారణ అనంతరం ఆమెను ఈడీ అరెస్టు చేసింది.