Old Lady Dance viral video : ఈ బామ్మగారి స్టెప్పులు చూస్తే ప్రొఫెషనల్ డాన్సర్స్ కూడా వావ్ అనాల్సిందే..
ఈ బామ్మగారి స్టెప్పులు చూస్తే ప్రొఫెషనల్ డాన్సర్ కూడా వావ్ అనాల్సిందే..
Old Lady Dance : వివాహాలు వంటి శుభకార్యాల్లో డ్యాన్సులు సర్వసాధారణమైపోయాయి. అమ్మాయిలే కాదు వృద్ధులు కూడా స్టెప్పులతో జోష్ నింపుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడాలేకుండా డ్యాన్సులు అద్దరగొడుతున్నారు. సరదాగా వేసే డ్యాన్సుల్లో పర్ ఫెక్ట్ గా ఉండవు. ఏదో వేస్తున్నామా అన్నట్లే ఉంటాయి. కానీ ఓ వేడుకలో ఓ పెద్దావిడ వేసిన డ్యాన్స్ చూస్తే ప్రొఫెషనల్ డాన్సర్లు కూడా ఫిదా అయిపోతారు.
వయసు కేవలం శరీరానికే కానీ మనసుకు కాదని ఓ పెద్దావిడ. స్టెప్ బై స్టెప్ పర్ ఫెక్ట్ గా కాన్ఫిడెన్స్ గా వేసి చూసేవారినందరిని మైమరపించింది. వయసు కేవలం ఓ సంఖ్య మాత్రమే అనడానికి కూడా ఆమె ఓ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్‌గా నిలిచింది. పంజాబీ సాంగ్స్‌కు అనుగుణంగా హుషారైన డ్యాన్స్ మూమెంట్స్‌తో ఓ మహిళ స్టేజ్‌పై అదరగొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శైల్ శర్మ అనే యూజర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ క్లిప్‌లో రెడ్ శారీ ధరించిన ఎ పెద్దావిడ పెళ్లి వేడుకలతో తన ఫర్ ఫెక్ట్ డ్యాన్స్ తో జోష్ నింపింది. ధోల్ జగీరో దా అనే పాటకు తనదైన ఈజ్, గ్రేస్‌తో స్టెప్పులు వేయడం ఆకట్టుకుంది. రేఖ అనే ఈ మహిళ యార్ బోల్దా సాంగ్‌కు కూడా స్టేజీపై తన కిల్లర్ స్టెప్స్‌తో అలరించారు. ఈ వీడియోకు దట్స్ హౌ షి స్టోల్ ది షో అనే క్యాప్షన్ ఇచ్చారు.