Electric Scooter : ఎలక్ట్రిక్ స్కూటర్‌.. ఎన్ని డబ్బులు ఆదా చేస్తుందో తెలుసా?

పెట్రోల్ స్కూటర్ కంటే ఎలక్ట్రిక్ స్కూటర్ వాడితే ఎక్కువ డబ్బు ఆదా చేసుకోవచ్చని ఆటోకారు సంస్థ తెలిపింది. తాజాగా సంస్థ ఎలక్ట్రిక్, పెట్రోల్ స్కూటర్ల ఖర్చులను బేరీజు వేస్తూ ఓ రిపోర్ట్ ను విడుదల చేసింది. ఇందులో పెట్రోల్ పై కాకుండా, ఎలక్ట్రిక్ స్కూటర్ పై కిలోమీటర్ ప్రయాణిస్తే రూ.1.50 ఆదా చేసుకోవచ్చని తెలిపింది.

Electric Scooter : ఎలక్ట్రిక్ స్కూటర్‌.. ఎన్ని డబ్బులు ఆదా చేస్తుందో తెలుసా?

Electric Scooter (3)

Electric Scooter : పెట్రోల్ రేట్లు సెంచరీ దాటాయి. మరోవైపు వాయు కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఈ తరుణంలోనే చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. జీరో వాయుకాలుష్యంతోపాటు, పెట్రోల్ ఖర్చులు తగ్గుతుండటంతో చాలామంది ఈవీ వాహనాలపై మక్కువ చూపుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఈవీ స్కూటర్ల వల్ల కలిగే ప్రయోజనం ఎంత అనే సందేహం చాలా మంది మదిలో మెదులుతోంది. ఈ సందేహాలకు ‘ఆటోకార్‌’ ఇలా సమాధానం ఇచ్చింది.

టీవీఎష్‌ ఐక్యూబ్‌

ఎలక్ట్రిక్‌ స్కూటర్ల మైలేజీ, మెయింటనెన్స్‌ తెలుసుకునేందుకు టీవీఎస్‌ ఐక్యూబ్‌ స్కూటర్‌ని పరిశీలనలోకి తీసుకున్నారు. టీవీఎస్‌ ఐక్యూబ్‌లో 2.2 కిలోవాట్‌ లిథియమ్‌ ఐయాన్‌ బ్యాటరీని ఉపయోగించారు. ఈ బ్యాటరీ ఛార్జ్ కావాలంటే ఐదు గంటల సమయం పడుతుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే ఎకోమెడ్ లో అయితే 74 కిమిలోటర్లు, పవర్ మోడ్ లో అయితే 48 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. అయితే ఎకోమోడ్ లో గంటకు 48 కిలోమీటర్ల వేగంతోనే వెల్లగం. ఈ స్కూటర్ పై ఒక కిలోమీటర్ వెళ్లేందుకు 30 పైసలు ఖర్చు అవుతుంది. ఇదే సమయంలో లీటరు పెట్రోలు ధర రూ.107ని తీసుకుంటే పెట్రోలు ఇంజను స్కూటరు ప్రయాణానికి ఒక కిలోమీటరకు రూ. 1.80 వంతున ఖర్చు వస్తున్నట్టు ఆటోకారు పేర్కొంది.

పెట్రోల్ స్కూటర్, ఎలక్ట్రిక్ స్కూటర్ల ఖర్చులను ఆటోకారు ఈ విధంగా వివరించింది. పెట్రోలు స్కూటరు, ఈవీ స్కూటర్లను పరిశీలిస్తే… పది వేల కిలోమీటర్లు తిరిగే సరికి ఎలక్ట్రిక్‌ వెహికల్‌​ కేవలం పెట్రోలు రూపంలోనే రూ. 15,000 పెట్రోలు ఆదా చేసేందుకు తోడ్పడుతోంది. ఇక 50,000 కి.మీ ప్రయాణం పూర్తి చేసే సరికి రూ. 75,000ల వరకు మిగులు ఉంటున్నట్టు ఆటోకార్‌ తెలిపింది. ఇక సర్వీసింగ్ ఛార్జ్, ఆయిల్ చేంజ్ వంటివి ఎలక్ట్రిక్ స్కూటర్ కి అవసరం లేదు.