Flipkart: ఫ్లిప్‌కార్ట్‌కు ఈడీ నోటీసులు.. రూ.10.6 కోట్ల జరిమానా?

ప్రఖ్యాత ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ కు ఫారిన్ ఎక్సేంజ్ మేనేజ్ మెంట్ నిబంధనల ఉల్లంఘన కింద ఈ నోటీసులు ఇచ్చింది. నిజానికి ఈ నోటీసులు జులైనెలలోనే జారీ అయినట్లు ఫ్లిప్ కార్ట్..

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌కు ఈడీ నోటీసులు.. రూ.10.6 కోట్ల జరిమానా?

Flipkart

Flipkart: ప్రఖ్యాత ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ కు ఫారిన్ ఎక్సేంజ్ మేనేజ్ మెంట్ నిబంధనల ఉల్లంఘన కింద ఈ నోటీసులు ఇచ్చింది. నిజానికి ఈ నోటీసులు జులైనెలలోనే జారీ అయినట్లు ఫ్లిప్ కార్ట్ సంస్థ చెప్తుండగా ఇప్పుడు ఇది తమిలనాడు హైకోర్టుకు చేరడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఫ్లిప్‌కార్ట్ తో పాటు దాని వ్య‌వ‌స్థాప‌కులు, మ‌రో తొమ్మిది మందికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసింది.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల చ‌ట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను వారిపై 1.35 బిలియ‌న్ డాల‌ర్ల జ‌రిమానాను ఎందుకు విధించ‌కూడ‌ద‌న్న విష‌యంపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని పేర్కొంది. ఈ సంస్థ 2009 నుంచి 2015 మ‌ధ్య విదేశీ మారక నిర్వహణ చట్టం నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించి పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టింద‌ని ఈడీ వ‌ర్గాలు ఆరోపిస్తుండగా.. ‘విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు స‌హా భార‌త చ‌ట్టాలు, నిబంధ‌న‌ల‌న్నింటికీ క‌ట్టుబ‌డి సంస్థ న‌డుచుకుంటుందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది.

కాగా, నోటీసులు అందుకున్న తొమ్మిది మందిలో ఒకరైన ఫ్లిప్ కార్ట్ సహా వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ నోటీసులను సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తాను సంస్థ నుండి ఎప్పుడో బయటకు వచ్చేశానన్న బన్సాల్ సంస్థ అంతర్గత వ్యవహారాలతో తనకు సంబంధం లేదని కోర్టుకు తెలిపారు. మరి అసలు సంస్థ ఈ నోటీసులపై ఎలా ముందుకెళ్తుందన్నది ఇంకా తేలాల్సి ఉంది.