Delhi : ఢిల్లీ బాలికల వసతిగృహంలో మంటలు…35మంది బాలికలను రక్షించిన సహాయసిబ్బంది

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని బాలికల వసతి గృహంలో మంటలు చెలరేగాయి. ఢిల్లీ ముఖర్జీ నగర్‌లోని మూడు అంతస్తుల పేయింగ్ గెస్ట్ ఫెసిలిటీలో బుధవారం సాయంత్రం మంటలు చెలరేగాయి. భవనంలో రాజుకున్న మంటల నుంచి 35 మంది బాలికలను రక్షించారు....

Delhi : ఢిల్లీ బాలికల వసతిగృహంలో మంటలు…35మంది బాలికలను రక్షించిన సహాయసిబ్బంది

Fire breaks out

Updated On : September 28, 2023 / 4:55 AM IST

Delhi : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని బాలికల వసతి గృహంలో మంటలు చెలరేగాయి. ఢిల్లీ ముఖర్జీ నగర్‌లోని మూడు అంతస్తుల పేయింగ్ గెస్ట్ ఫెసిలిటీలో బుధవారం సాయంత్రం మంటలు చెలరేగాయి. భవనంలో రాజుకున్న మంటల నుంచి 35 మంది బాలికలను రక్షించారు. (Fire breaks out at paying-guest facility) ఘటనాస్థలికి చేరుకున్న 20 అగ్నిమాపక యంత్రాలు సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. గంటన్నర సేపు సాగిన సహాయ కార్యక్రమాలతో బాలికలందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. (35 girls rescued) మెట్ల వద్ద అమర్చిన విద్యుత్ మీటరు వద్ద మంటలు ప్రారంభమై పై అంతస్తులకు వ్యాపించాయి.

Manipur : యువకుల హత్యపై పెల్లుబుకిన ఆగ్రహం..మణిపూర్‌లో బీజేపీ కార్యాలయం దహనం

కొంతమంది బాలికలను వైద్య సహాయం కోసం ఆసుపత్రికి తరలించినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. అగ్నిప్రమాదంతో సంఘటన స్థలంలో పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు, ఎంత మేరకు నష్టం జరిగిందన్న విషయం ఇంకా తెలియరాలేదు. ప్రాథమిక అంచనా ప్రకారం భవనంలో అగ్నిమాపక భద్రతా చర్యలు లోపించాయి.

Telangana BJP : గోడ దూకేస్తారా? తెలంగాణ బీజేపీలో దుమారం, పార్టీని హడలెత్తిస్తున్న ఆ నలుగురు సీనియర్లు

ఈ ఏడాది జులైలో అదే ప్రాంతంలోని ఒక కోచింగ్ సెంటర్‌లో పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సమయంలో విద్యార్థులు కిటికీ నుంచి కిందకు దూకి భవనం ఖాళీ చేయవలసి వచ్చింది. ఫలితంగా విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ అగ్నిప్రమాద ఘటన ఆ ప్రాంతంలో అగ్నిమాపక భద్రతా చర్యలపై చర్చకు దారితీసింది.