Uttar Pradesh: జిల్లా కోర్టులో కాల్పులు.. అండర్‌ ట్రయల్‌ ఖైదీ మృతి

ఈ సంఘటనలో సదరు ఖైదీతో ఉన్న హర్యానా పోలీసు అధికారికి సైతం గాయలయ్యాయి. గాయపడిన పోలీసు అధికారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో భారీగా బలగాలను మోహరించారు అధికారులు. కాల్పులకు పాల్పడిన దుండగులను ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అక్కడే ఉన్న పోలీసులు సైతం వారిని పట్టుకునే ప్రయత్నం చేయకపోవటం వల్ల దర్జాగా అక్కడి నుంచి వెళ్లిపోయారని స్థానికులు తెలిపారు.

Uttar Pradesh: జిల్లా కోర్టులో కాల్పులు.. అండర్‌ ట్రయల్‌ ఖైదీ మృతి

Firing in district court in uttar pradhesh

Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాపుర్‌ జిల్లా కోర్టులో కాల్పులు కలకలం సృష్టించాయి. మంగళవారం ఉదయం కొందరు గుర్తు తెలియని దుండగులు అండర్‌ ట్రయల్‌లో ఉన్న ఖైదీపై కాల్పులు జరిపారు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు, అండర్‌ ట్రయల్‌ ఖైదీ లఖన్‌పాల్‌ను కోర్టులో హాజరు పరిచేందుకు హర్యానా నుంచి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. అండర్‌ ట్రయల్‌ ఖైదీనే లక్ష్యంగా ఈ కాల్పులు జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

ఈ సంఘటనలో సదరు ఖైదీతో ఉన్న హర్యానా పోలీసు అధికారికి సైతం గాయలయ్యాయి. గాయపడిన పోలీసు అధికారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో భారీగా బలగాలను మోహరించారు అధికారులు. కాల్పులకు పాల్పడిన దుండగులను ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అక్కడే ఉన్న పోలీసులు సైతం వారిని పట్టుకునే ప్రయత్నం చేయకపోవటం వల్ల దర్జాగా అక్కడి నుంచి వెళ్లిపోయారని స్థానికులు తెలిపారు.

Bihar: నితీశ్‭కు కొత్త తలనొప్పి.. మంత్రివర్గ విస్తరణ కార్యక్రమానికి 5గురు జేడీయూ ఎమ్మెల్యేలు డుమ్మా