Zomato : జొమాటో షాకింగ్ డెసిషన్.. సేవలు పూర్తిగా బంద్

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 225 చిన్న నగరాల్లో తమ సంస్థ సేవలు నిలిపివేసినట్లు ప్రకటించింది.

Zomato : జొమాటో షాకింగ్ డెసిషన్.. సేవలు పూర్తిగా బంద్

Zomato : ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 225 చిన్న నగరాల్లో తమ సంస్థ సేవలు నిలిపివేసినట్లు ప్రకటించింది. కంపెనీ మూడో త్రైమాసిక ఫలితాల విడుదల సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది జొమాటో. గ్రాస్ ఆర్డర్ విలువ 0.3 శాతం ఉన్న కారణంగా ఆయా నగరాల్లో సేవలు నిలిపివేస్తున్నట్లు జొమాటో తన నివేదికలో స్పష్టం చేసింది.

Also Read..Whatsapp Messages : మీ వాట్సాప్‌లో ఫోన్ నెంబర్ సేవ్ చేయకుండానే ఇలా ఈజీగా మెసేజ్ పంపుకోవచ్చు తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

గత కొన్ని త్రైమాసికాలుగా 225 నగరాల్లో వ్యాపారం ప్రోత్సాహకరంగా లేదని, ప్రస్తుతం ఫుడ్ డెలివరీ మార్కెట్ లో నెలకొన్న ఈ మందగమనం ఎవరూ ఊహించలేనిదని తెలిపింది. ఇది తమ వ్యాపార వృద్ధి పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు.

Also Read..PAN-Aadhaar Link : మీ ఆధార్- పాన్ కార్డు ఇంకా లింక్ చేయలేదా? ఈ తేదీలోగా SMS ద్వారా వెంటనే లింక్ చేయండి.. ఇదిగో ప్రాసెస్..!

కానీ, కంపెనీ నిర్దేశించుకున్న దీర్ఘకాల లక్ష్యాలను అందుకోవటం ఎంతో ముఖ్యమని తెలిపింది. అందుకే, ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది జొమాటో. సేవలు నిలిపివేసిన నగరాల జాబితాను మాత్రం జొమాటో వెల్లడించింది. అక్టోబర్, డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ 346.6 కోట్ల
రూపాయల నష్టాన్ని నమోదు చేసింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

గత అక్టోబర్ నుంచి ఫుడ్ డెలివరీ రంగంలో వ్యాపారం మందకొడిగా సాగడమే ఇందుకు ప్రధాన కారణం అని జొమాటో భావిస్తోంది. ఈ ప్రభావం దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ.. ప్రధానంగా 8 నగరాల్లో ఎక్కువగా ఉందని నివేదికలో పేర్కొంది.